Who is the star heroine who insulted Jr.NTR

Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ని నిజంగానే ఆ హీరోయిన్ షూటింగ్ సెట్ లో అంతగా అవమానించిందా..అంత పెద్ద స్టార్ హీరోని అవమానించాల్సిన పని ఏం వచ్చింది? ఆ హీరో చేసిన తప్పేంటి.. ఇంతకీ ఎన్టీఆర్ ని అంతలా అవమానించిన హీరోయిన్ ఎవరు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం. జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం లో నటించిన మూవీ జై లవకుశ..ఈ సినిమాకి కే. ఎస్.రవీంద్ర దర్శకత్వం వహించగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మతగా వ్యవహరించారు.

Who is the star heroine who insulted Jr.NTR

అలాగే ఈ సినిమాలో రాశిఖన్నా, నివేదా థామస్ లు హీరోయిన్స్ గా చేశారు. అయితే ఈ మూవీలో నివేదా సెకండ్ హీరోయిన్గా చేస్తే రాశి ఖన్నా మెయిన్ హీరోయిన్ గా చేసింది. ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నివేద థామస్ ని ఫిక్స్ చేసిన సమయంలో రాశిఖన్నాకి ఒక రూమర్ వినిపించిందట. అదేంటంటే నివేద థామస్ కి తనతో సరి సమానంగా రెమ్యూనరేషన్ తో పాటు తన కంటే ఎక్కువ ప్రాధాన్యత నివేదాకి ఇస్తున్నారని తెలిసి షూటింగ్ సెట్లోనే గోలగోల చేసిందట. (Jr.NTR)

Also Read: Sr.NTR: Sr.ఎన్టీఆర్ చెవు రింగ్ ఊడిపోయేలా కొట్టిన స్టార్ హీరోయిన్.. అంత తప్పు ఏం చేశారు..?

అంతేకాదు నేను ఇందులో నటించను అని ఇంటికి వెళ్లిపోయిందట. దాంతో జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయం మొత్తం తెలిసి నేరుగా రాశి ఖన్నా ఇంటికి వెళ్లి ఈ సినిమాలో మీరే మెయిన్ హీరోయిన్ అలాగే మీకంటే ఆమె రెమ్యూనరేషన్ తక్కువే.. ఇందులో మీరు గొడవ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. రూమర్స్ నమ్మకండి. డైరెక్ట్ గా షూటింగ్ సెట్ కి వచ్చి షూటింగ్ కంటిన్యూ చేయండి. లేకపోతే మీకు ఇబ్బంది ఏమీ లేకుండా మరో హీరోయిన్ ని తీసుకుంటాము.. అంటూ కూల్ గా తను చెప్పాల్సిన విషయం చెప్పేసి సైలెంట్గా షూటింగ్ స్పాట్ కి తిరిగి వచ్చేసారట జూనియర్ ఎన్టీఆర్.

 Who is the star heroine who insulted Jr.NTR

ఇక రాశి ఖన్నా మైండ్ లో ఒకసారి ఆలోచించి అసలే స్టార్ హీరో ఇప్పుడు ఈ అవకాశాన్ని మిస్ చేసుకుంటే బాగుండదు. మళ్ళీ గొడవ పెద్దదైతే పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తాయో రావో అని తనకుతానే అనుకొని చివరికి షూటింగ్ కి వచ్చేసిందట. అలా జై లవకుశ సినిమా షూటింగ్ సమయంలో ఒక గొడవ జరిగిందని ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకున్నారు.(Jr.NTR)

Join WhatsApp