Who is the Tollywood hero who bought Rakul Preet Singh 3 crore house

Rakul Preet Singh: ఈ మధ్యనే పెళ్లయిన కొత్త పెళ్లికూతురు రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లయినా కూడా డ్రెస్సింగ్ స్టైల్ లో కానీ సినిమాల్లో కానీ ఎలాంటి చేంజ్ రాలేదు అని తెలుస్తుంది.బహుశా పెళ్లికి ముందే డ్రెస్సింగ్ స్టైల్ లో సినిమాల విషయంలో తన అత్తింటి వారి దగ్గర కండిషన్స్ పెట్టుకుందో ఏమో తెలియదు కానీ పెళ్లయినా కూడా గ్యాప్ లేకుండా సినిమాల మీద సినిమాలు నటిస్తోంది.

Who is the Tollywood hero who bought Rakul Preet Singh 3 crore house

ఈ విషయం పక్కన పెడితే..అప్పట్లో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో రకుల్ ప్రీత్ సింగ్ అందం పై మోజు పడ్డ ఒక స్టార్ హీరో ఆమెకి 3 కోట్ల లగ్జరీ ఇల్లు కొనిచ్చారట.అయితే ఈ రూమర్ నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతోనే చాలామంది జనాలు నిజంగానే రకుల్ ఈ మధ్య ఇల్లు కొన్నది. ఆ ఇల్లు కొనిచ్చింది హీరోనే కావచ్చు అని అందరూ భావించారు.(Rakul Preet Singh)

Also Read: Niharika: వాళ్లందరూ నా వెంట్రుకతో సమానం.. మెగా డాటర్ నిహారిక సంచలన కామెంట్స్..!

అయితే ఈ రూమర్ మీడియాలో హాట్ టాపిక్ గా మారేసరికి ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్.. చాలామంది నా గురించి చెడు ప్రచారం చేస్తున్నారు. నేను ఈ మధ్యనే ఒక ఇల్లు కొన్నాను.ఆ ఇల్లు నా కష్టార్జితం. కానీ అలాంటి నా సొంత డబ్బులతో కొన్న ఇల్లుని ఓ హీరో కొనిచ్చారు అంటూ రూమర్ క్రియేట్ చేస్తున్నారు.ఇందులో ఎలాంటి నిజం లేదు. నటినటుల మధ్య ఎఫైర్ వార్తలు క్రియేట్ చేయడం సహజమే.

Who is the Tollywood hero who bought Rakul Preet Singh 3 crore house

కానీ ఒక హీరో ఏకంగా ఇల్లే కొనిచ్చారంటే ఆ వార్తను మా కుటుంబ సభ్యులతో పాటు నేను కూడా తీసుకోలేక పోయాను అని రకుల్ ఆ ఇంటర్వ్యూలో చెప్పింది.అంతేకాదు ఈ రూమర్ వల్ల మా ఫ్యామిలీతో పాటు నేను కూడా చాలా డిస్టర్బ్ అయ్యానని, ఒకవేళ నాకు ఇండస్ట్రీలో కోట్లు పెట్టి ఇల్లు కొనిచ్చే ఫ్రెండ్ ఉన్నా కూడా నేను మాత్రం ఫ్రెండ్షిప్ ముసుకు వేసుకొని ఆ హీరో ఫ్రీగా ఇల్లు కొనిస్తే తీసుకునే దాన్ని కాదు అంటూ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్.ఇక చిన్న హీరోయిన్గా మొదలుపెట్టిన రకుల్ ప్రస్తానం ప్రస్తుతం బాలీవుడ్ రేంజ్ కి ఎదిగింది.(Rakul Preet Singh)

Join WhatsApp