Who is the Tollywood hero who dubbed for Nithiin in Jayam and Dil?

Nithiin: టాలీవుడ్ లో యూత్ ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్న నితిన్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తండ్రి సుధాకర్ రెడ్డి ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్ కావడంతో చిన్నతనం నుంచి నితిన్‌ సినిమా వాతావరణంలోనే పెరిగాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటే నితిన్ కు ఎంతో అభిమానం. పవన కళ్యాణ్ తొలిప్రేమ సినిమా చూసి తాను కూడా నటుడు కావాలని నితిన్ ఆశపడ్డాడు. ఇక ఇదే తరుణంలో ఓ థియేటర్ లో నితిన్ ను చూసిన డైరెక్టర్ తేజ తాను తెరకెక్కించబోయే జయం సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారు.

Who is the Tollywood hero who dubbed for Nithiin in Jayam and Dil?

అలా 2002లో జ‌యంతో కెరీర్ ప్రారంభించిన నితిన్.. తొలి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత దిల్, సంబరం, శ్రీ ఆంజనేయం, సై, అల్లరి బుల్లోడు, ధైర్యం, రామ్, టక్కరి, ఆటాడిస్తా ఇలా హిట్లు ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. కెరీర్ ఆరంభంలో తన సినిమాలకు నితిన్ డబ్బింగ్ చెప్పేవాడు కాదు. టాలీవుడ్ కి చెందిన మరో హీరో అతనికి గాత్ర దానం చేసేవారు.

ఇంతకీ అత‌ను మరెవరో కాదు శివాజీ. సహాయక నటుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన శివాజీ.. ఆ తర్వాత హీరోగా మారాడు. పలు చిత్రాల్లో నటించాడు. కానీ ఎక్కువ కాలం కథానాయకుడిగా నిలదొక్కుకోలేకపోయాడు. 2016 తర్వాత వెండితెర‌కు దూరమై రాజకీయాల్లో బిజీ అయిన శివాజీ.. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 7 ద్వారా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. ఆ తర్వాత 90 ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ తో నటుడిగా మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు.(Nithiin)

Also Read: Silk Smitha: ఆ త‌ప్పు వ‌ల్లే సిల్క్ స్మిత బ‌లైపోయింది.. జ‌య‌మాలిని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

ప్రస్తుతం ఆయనకు ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. అయితే శివాజీ నటుడుగా మాత్రమే అందరికి పరిచయం ఉంది. కానీ ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేశాడు. జయం, దిల్ మరియు సంబరం చిత్రాల్లో హీరో నితిన్ కు డబ్బింగ్ చెప్పింది శివాజీనే. సంబరం తర్వాత నితిన్ తన చిత్రాలకు తానే స్వయంగా డ‌బ్బింగ్‌ చెప్పుకోవడం స్టార్ట్ చేశాడు. కాగా, గ‌త కొంత కాలం వ‌రుస ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌తం అవుతున్న నితిన్ ప్ర‌స్తుతం త‌మ్ముడు అనే సినిమా చేస్తున్నాడు. రాబిన్ హుడ్ అనే మ‌రో చిత్రం నితిన్ లైన‌ప్ లో ఉంది.

Join WhatsApp