Will Junior NTR - Ram Pothineni become brothers?

Junior NTR: త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ ఏ విధంగా పెరిగిపోయిందో మనందరం చూస్తూనే ఉన్నాం. పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన తారక్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. జపాన్లో ఎన్టీఆర్కు మంచి ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. ప్రస్తుతం బడా సినిమాలను లైన్లో పెడుతూ షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ తో సినిమాలు చేయడానికి హీరోయిన్స్ ఆసక్తి కూడా చూపిస్తున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Will Junior NTR – Ram Pothineni become brothers?

ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ మరియు అతిలోక సుందరి సౌందర్య కుమార్త జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ సినిమాతోనే టాలీవుడ్ కి అరణ్యేత్రం చేస్తుంది జాన్వి. ఇక ఈ మూవీ అనంతరం బాలీవుడ్ బడా సినిమా వార్ 2 లో కూడా నటిస్తున్నాడు తారక్. ఈ మూవీలో హృతిక్ రోషన్ తో పాటు కలిసి నటించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

Also Read: Anjali: రహస్యంగా పెళ్లి చేసుకున్న అంజలి మాజీ ప్రియుడు..హనీమూన్ కి వెళ్తూ..!

ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్కి రామ్ పోతినేని బ్రదర్ అవుతాడు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎస్ మీరు విన్నది నిజమే.. తారక్ మరియు రామ్ బంధువులు. ఇదే విషయాన్ని రామ్ పో వేదికపై స్పష్టంగా తెలియజేశాడు. గతంలో ఓ వేదికపై రామ్‌ పోతినేని మాట్లాడుతూ.. ఎన్టీఆర్ నాకు వరసకు అన్నయ్య అవుతాడు అని తెలిపాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన ఎన్టీఆర్ అభిమానులు మరియు రామ్ పోతినేని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

Will Junior NTR - Ram Pothineni become brothers?

ఇన్నాళ్లు ఈ విషయం మాకు తెలియలేదే అంటూ కామెంట్స్ సైతం చేస్తున్నారు. ఇక వీరిద్దరూ అన్నదమ్ములు అవుతారని తెలిసి పలువురు సంతోషపడుతున్నారు కూడా. ఇక ప్రస్తుతం రాం పోతినేని ఇస్మార్ట్ శంకర్ 2 సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమాపై మంచి హైప్స్ ఏర్పడ్డాయి. గత ఏడాది స్కంద మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన రాం పోతినేని భారీ డిజాస్టర్ ని వెలుగు చూశాడు. అందువల్లే ఈసారి పక్కా ప్లానింగ్ తో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు.(Junior NTR)

Join WhatsApp