YouTuber Chandu arrested in rape case

Breaking: ప్రస్తుత కాలంలో రేప్స్ మరియు గంజాయి, డ్రగ్స్ వంటి కేసుల్లో సినీ సెలబ్రిటీలు ఎక్కువగా పట్టుబడుతున్నారు. ఇక తాజాగా రేప్ కేసులో మరో యూట్యూబర్ పై తీవ్ర చర్యలు తీసుకున్నారు పోలీసులు. యూట్యూబర్ పక్కింటి కుర్రాడుగా తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్న చందు సాయి అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్లోని నార్సింగి కి చెందిన ఓ యువకురాలు ఫిర్యాదుతో చందు ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Breaking: YouTuber Chandu arrested in rape case

ప్రేమ పేరుతో తనను మోసం చేసి రేప్ చేశాడని ఆ యువకురాలు కంప్లైంట్ ఇచ్చింది. ఇక చందు కొంతకాలం కిందట పక్కింటి కుర్రాడు అనే పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించాడు. ఆ యూట్యూబ్ ఛానల్ లో ఫన్నీ వీడియోస్ మరియు తెలుగు వారికి ఆకట్టుకునే కాన్సెప్ట్ తో ముందుకి వచ్చేవాడు. ప్రస్తుత కాలంలో చందు యూట్యూబ్ ఛానల్ కు ఏకంగా 13 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు.

Also Read: Chiranjeevi: చిరంజీవితో సినిమాలు చేస్తే చస్తావ్ అని రాఘవేంద్రరావుకి వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో.. ఎవరంటే..?

అలాంటి వ్యక్తి తనను ప్రేమ పేరుతో మోసం చేశారని ఓ యువతి ఫిర్యాదు చేయడంతో తన అభిమానులు మొత్తం షాక్ అయ్యారు. ఇక ఆ యువకురాలు పేరు తెలియకపోయినప్పటికీ చందు ని అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. మొదట్లో తనను గాఢంగా ప్రేమిస్తున్నట్లు తెలియజేశాడని అనంతరం లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆ యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఏప్రిల్ 25 2021న చందు సాయి తన ను రేప్ చేశాడని ఆమె వెల్లడించింది. తనకి జరిగిన అన్యాయాన్ని చెబుతూ కంటతడి పెట్టుకుంది.

YouTuber Chandu arrested in rape case

అదేవిధంగా తన బర్తడే సెలబ్రేషన్స్ అనే వంక చెప్పి ఈ ఘోరానికి పాల్పడినట్లు తెలియజేసింది. ఇక ప్రస్తుతం చందు ఈ కేసు పై స్పందిస్తూ ఒక ట్వీట్ ని షేర్ చేశాడు. ” అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లివింగ్ రిలేషన్షిప్ లాంటివి పెట్టుకోకండి. తప్పు జరిగిందంటే అది ఇద్దరూ చేసినట్లే కానీ దెబ్బ అబ్బాయికి పడుతుంది. రేప్ లు లాంటివి మనమెందుకు చేస్తాము. లివింగ్ లో ఇద్దరూ ఉన్నాము. కాపాడుకోవాలని చూస్తాను. అది వర్కౌట్ అవ్వలేదు కానీ కేసు నా మీద వేశారు ” అంటూ వెల్లడించాడు చందు. ప్రస్తుతం ఈయన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.(Breaking)

Join WhatsApp