YouTuber Deepti Sunaina bought a new car

Deepti Sunaina: బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటూ ఉంటున్నారు. వారిలో ఒకరైన దీప్తి సునైనా మనందరికీ సుపరిచితమే. స్వతహాగా యూట్యూబర్ అయిన ఈమె షణ్ణు తో ప్రేమ వ్యవహారంతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం కవర్ సాంగ్స్, వెబ్ సిరీస్ లు చేస్తూ ఫుల్ బిజీగా తన లైఫ్ ను లీడ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తాజాగా ఈమె కొత్త కారు కొంది. అందరిలా లగ్జరీ కార్లు కాకుండా కాస్త డిఫరెంట్ కారు తీసుకుంది దీప్తి.

YouTuber Deepti Sunaina bought a new car

మరి ఆ కారు డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. డబ్ స్మాష్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న దీప్తి సునయన.. అనంతరం షార్ట్ ఫిలిమ్స్ మరియు కవర్ సాంగ్స్ చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతానికి అయితే యూట్యూబ్లో వెబ్ సిరీస్లు చేస్తుంది. అప్పట్లో బిగ్ బాస్ రెండో సీజన్లో పాల్గొని మంచి ఫేమస్ అయ్యింది. ఇక యూట్యూబ్ షణ్ముఖ్ తో ప్రేమాయణం నడిపి ప్రస్తుతం బ్రేకప్ చేసుకుంది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ తన తొలి కారుని కొనుగోలు చేసింది. టయోటా హై లక్స్ అనే కారుని కొనుగోలు చేసింది దీప్తి.

Also Read: Health: ఆరోగ్యానికి ఎంతో మంచి కలిగించే కాకరకాయ.. ఈ వ్యక్తులు తింటే ప్రమాదమా..?

ఇందులో డ్రైవర్ తో పాటు మరో ముగ్గురు వరకు కూర్చోవచ్చు. అదేవిధంగా వెనుక లగేజీ పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుంది.‌ నార్మల్ కారు కాకుండా ఇలా డిఫరెంట్ కారు ఎందుకు తీసుకుందా అని ప్రేక్షకులు అందరూ అనేక విధాలుగా తమ ప్రశ్నలను అడుగుతున్నారు. ఇక మార్కెట్లో ఈ కారు ధర 30 నుంచి 37 లక్షల వరకు ఉండనున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి అయితే యూట్యూబ్ ద్వారా మంచిగానే సంపాదిస్తూ కారు కొనేసింది దీప్తి. నిజానికి చెప్పాలంటే ఈమెకి వచ్చిన రెమ్యునరేషన్ కొంతమంది స్టార్ హీరోయిన్స్ కి కూడా రాదనే చెప్పాలి. యూట్యూబ్ ఏ అని చెన్నచూపు చూసేవారికి ఇదొక గుణపాఠమని చెప్పుకోవచ్చు.

YouTuber Deepti Sunaina bought a new car

యూట్యూబ్లో రాణిస్తూనే ఇంత ఎత్తుకి ఎదిగింది దీప్తి. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి కూడా రావాలని గట్టి ప్రయత్నాలే చేస్తుంది. ఇక ఈమె లాగానే మొదట యూట్యూబ్లో పలు వెబ్ సిరీస్ లో చేసుకుంటూ హీరోయిన్గా ఎదిగిన వైష్ణవి చైతన్య నీ ఇన్స్పిరేషన్ గా తీసుకున్న ఈమె హీరోయిన్గా ఎదగెందుకు ప్రయత్నిస్తుంది. నిజానికి చెప్పాలంటే వైష్ణవి చైతన్య మీద దీప్తి సునయన చాలా అందంగా ఉంటుంది. కానీ ఈమెకి సినిమాల్లో నటించడానికి అవకాశాలు పెద్దగా రావడం లేదు. మరి ఈమె అందచందాలకి కరిగి ఏ డైరెక్టర్ అయినా ఈమెకి అవకాశం ఇస్తారో లేదో చూడాలి.(Deepti Sunaina)

Join WhatsApp