Central Govt Urged to Clear Pending DA, DR Arrears of Employees, Pensioners

Central Govt:కేంద్రము ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌ లో కీలక ప్రకటనలు వెలువడే అవకాశం వుంది. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు కనుక కీలక ప్రకటనలు చేస్తారని అంతా అంటున్నారు. అయితే ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డియర్‌నెస్ అలెవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ బకాయిలు విడుదల చెయ్యమని డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డియర్‌నెస్ అలెవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ బకాయిలు విడుదల చెయ్యమని చెప్తోంది.

Central Govt Urged to Clear Pending DA, DR Arrears of Employees, Pensioners

పైగా కోవిడ్-19 సమయంలో 18 నెలల డీఏ, డీఆర్ బకాయిలు పెండింగ్ లో వున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ క్రమం లో ఓ లేఖ రాశారు. భారతీయ ప్రతిక్షా మజ్దూర్ సంఘ్ జనరల్ సెక్రెటరీ ముకేశ్ సింగ్. ఆ లేఖ లో ఆయన 18 నెలలకు సంబంధించిన బకాయిలను విడుదల చేయాలని అన్నారు. కోవిడ్-19 నేపథ్యంలో 2020, జనవరి నుంచి 2021 జూన్ ఇలా18 నెలల డీఏ, డీఆర్ పే చేయలేదు. ఇప్పటికీ బకాయిలుగానే అవి ఉన్నాయన్నారు భారతీయ ప్రతిక్షా మజ్దూర్ సంఘ్ జనరల్ సెక్రెటరీ ముకేశ్ సింగ్. అలానే ఈ విషయం మీద లోక్‌సభలో అడిగారు. (Central Govt)

Also Read: KTR: ఎన్నికల కోడ్ కంటే ముందు కాంగ్రెస్ ఆరు హామీల మీద ఉత్తర్వులు జారీ చెయ్యాలి

2020లో కోవిడ్ కారణంగా వచ్చిన ప్రతికూల ఆర్థిక ప్రభావం, ఇతర సంక్షేమ చర్యలకు నిధుల కొరత వలన బకాయిలు విడుదల సాధ్యమయ్యేవిగా పరిగణించడం లేదన్నారు. 18 నెలలకు సంబంధించిన బకాయిలు ఇవ్వాలని ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి డిమాండ్ వుంది. కరోనా సమయంలో ఉద్యోగులు చేసిన సేవలను చూసి డీఏ, డీఆర్ లను 3 విడతల పెండింగ్ బకాయిల విడుదలను సమీక్షించాలని లేఖలో కోరారు.

Central Govt Urged to Clear Pending DA, DR Arrears of Employees, Pensioners
Join WhatsApp