Mandarin orange: శీతాకాలంలో చాలామంది వేడివేడిగా ఆహార పదార్థాలను తినడానికి ఇష్టపడతారు. చాలా వరకు చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలని అనుకుంటారు. దీని కారణంగా ప్రజలు కొన్ని రకాల పోషక పదార్థాలను కోల్పోయినట్లేనని వైద్య నిపుణులు పేర్కొన్నారు. చలికాలంలో దొరికే కమలాఫలంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అయితే శీతాకాలంలో కమలాఫలం తింటే జలుబు వస్తుందని చాలామంది అనుకుంటారు. Mandarin orange

health benefits with Mandarin orange

కమలాఫలం సిట్రస్ జాతికి చెందినది. ఇందులో విటమిన్ సి మాత్రమే కాకుండా మెగ్నీషియం, ఐరన్, ఫైబర్, కాల్షియం, పొటాషియం, బి6 వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. శీతాకాలంలో కమలాఫలానికి మాత్రమే కాదు నిమ్మ, ఉసిరి మొదలైన పండ్లకు చాలామంది ప్రజలు దూరంగా ఉంటారు. జైపూర్ కు చెందిన ఆయుర్వేద వైద్యులు మాట్లాడుతూ చలికాలంలో కమలాఫలం ఉసిరి, నిమ్మ వంటి పుల్లని పండ్లను తీసుకోవడం మంచిదని పేర్కొన్నారు. Mandarin orange

Also Read: Adani Group: అదాని అరెస్ట్ వ్యవహారం.. రేవంత్ కు పదవి గండం?

ఎందుకంటే ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. విటమిన్ సి అధికంగా ఉన్న కమలాఫలం నిమ్మ, ఉసిరి వంటి సిట్రస్ పండ్లు సీజనల్ వ్యాధుల నుంచి రక్షించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. చలికాలంలో మధ్యాహ్న సమయంలో పుల్లని పండ్లను తినాలి. దానివల్ల శరీరానికి ఎలాంటి హాని కలగదు. అంతేకానీ పుల్లని పండ్లు తింటే శరీరానికి జలుబు వస్తుందని ఏదో జరుగుతుందని అనుకుంటే మన శరీరం ఎన్నో రకాల వ్యాధుల బారిన పడుతుందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. Mandarin orange