Fennel Seeds: కొంతమంది నోరు శుభ్రంగా ఉండడానికి సహజసిద్ధమైన సోంపుని వాడుతూ ఉంటారు. ఇది పూర్వకాలం నుంచి వాడుకలో ఉంది. ఇది రుచితో పాటు సువాసన కూడా బాగుంటుంది. అంతేకాకుండా సోంపు ఆరోగ్యానికి చాలా మంచిది. కొంతమంది ఇంట్లోనే సోంపుతో నీటిని తయారు చేసుకొని తాగుతూ ఉంటారు. ముఖ్యంగా సోంపు బరువు తగ్గడానికి, ఆహారం జీర్ణం కావడానికి ముఖ్యపాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా చర్మ ఆరోగ్యానికి, శరీర సౌందర్యానికి సహాయపడుతుంది. Fennel Seeds
Health Benfits With Fennel Seeds
భోజనం చేసిన అనంతరం సోంపును తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. భోజనం చేసిన అనంతరం చాలామంది సోంపుని తింటూ ఉంటారు. దీనివల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు ఉండడం వల్ల ఆరోగ్యానికి మేలును చేస్తాయి. ముఖ్యంగా సోంపుతో నీటిని తయారు చేసుకుని తాగినట్లయితే సులభంగా బరువు తగ్గుతారు. సోంపులో అధికంగా ఫైబర్ ఉండడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. దానివల్ల అసలు ఆకలి వేయదు. తద్వారా ఆహారం మితంగా తీసుకుంటాము. ఫలితంగా బరువు క్రమక్రమంగా తగ్గుతారు. Fennel Seeds
Also Read: Jagan: జగన్ తిరుమల పర్యటనను అడ్డుకునేందుకు కుట్రలు.. తెరపైకి కొత్త రూల్ ?
ముఖ్యంగా సోంపు తినడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుందని కొన్ని రకాల అధ్యయనాల్లో వెళ్లడైంది. సోంపు జీర్ణశక్తిని మెరుగుపరచడంతో పాటు ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహించడానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది. సోంపుతో చర్మ రక్షణ, స్త్రీలలో నెలసరి సమస్యలు సజావుగా సాగుతాయి. సోంపుని చాలా రకాల ఆయుర్వేద మందులలో కూడా వాడుతూ ఉంటారు. శరీరానికి సోంపు చాలా మంచిది. ప్రతి ఒక్కరు ఆహారం తీసుకున్న అనంతరం సోంపుని తినాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. Fennel Seeds