Do you want to make your Hair thicker

Hair: సాధారణంగా ప్రతి ఒక్కరికి తమ జుట్టు పొడవుగా మరియు ఒత్తుగా ఉండాలనేది ఓ కోరిక. ఈ కోరిక ఒక అమ్మాయిలలోనే ఉండదు అబ్బాయిలకి కూడా ఉంటుంది. తమ జుట్టును రక్షించుకునేందుకు పలు ట్రీట్మెంట్స్ తో పాటు బ్యూటీ పార్లర్ వంటి వాటికీ కూడా తిరుగుతూ ఉంటారు. ఇక అలా తిరిగినప్పటికీ మొదట్లో బాగానే అనిపించిన అనంతరం అనేక సైడ్ ఎఫెక్ట్స్ కలిగి జుట్టు ఊడిపోతుంది. ఇది నేటి కాలంలో ఎదురయ్యే సమస్య.

Do you want to make your Hair thicker

మరి దీనిని అరికట్టే చిట్కా నే లేదా అంటే ఉందని చెప్పొచ్చు. మనం ఎక్కడైతే ఓడిపోయాము అక్కడే మళ్ళీ ప్రయత్నిస్తే గలుస్తాం. మనం ఎక్కడైతే మన తిండిని మరియు ఇతర వ్యాయామాలను వదులుకున్నాము అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మన బాడీలో ప్రతి ఆర్గాన్ బలంగా మారడంతో పాటు పొడవైన జుట్టు కూడా మన సొంతమవుతుంది. సాధారణంగా పూర్వకాలంలో నూనెని వేడి చేసి తలకి రాస్తూ ఉండేవారు. కానీ ప్రస్తుత కాలంలో తమ జుట్టుకు నూనె పెట్టడమే ఎక్కువ అని భావిస్తున్నారు చాలామంది.

Also Read: Surekha: స్టార్ హీరోయిన్ ని చిరంజీవి పేరు వాడుకొని మోసం చేసిన సురేఖ.. అలాంటి ఫొటోస్ పంపమని..!

మన జుట్టుకు నూనెని వేడి చేసి రాయడం ద్వారా రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అలా మన జుట్టు ఊడకుండా తయారవుతుంది. అదేవిధంగా ప్రస్తుత కాలంలో అంటే అనేక హెయిర్ మాస్క్ వంటివి వచ్చాయి కానీ పూర్వకాలంలో గుడ్డు మరియు మందార పువ్వులను మన హెయిర్ కి పట్టించేవారు. ఇది మన హెయిర్ కి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. గుడ్డులో ఉండే పోషకాలు కారణంగా మన జుట్టు ఊడడం తగ్గి పొడవైన జుట్టు మన సొంతం అవుతుంది.

Do you want to make your Hair thicker

అదేవిధంగా మనం షాంపూ కానీ కుంకుడు కాయలు గాని ఇప్పటి కాలంలో నార్మల్గా వాటర్ లో కలిపేసి వాడేస్తున్నాం. కానీ కుంకుడుగాయలను మరియు షాంపూ అయినా గంజి నీటిలో నానబెట్టి అంటుకోవడం ద్వారా సాఫ్టీ అండ్ గ్లోయి హెయిర్ మీ సొంతం అవుతుంది. అదేవిధంగా చుండ్రు సమస్య కూడా మన జుట్టు ఎదుగుదలను ఆపుతుంది. ఈ చుండ్రుకి ఒకటే ఒక మార్గం కలబంద. కలబంద లో ఉండే విటమిన్లు కారణంగా మన జుట్టులో ఉండే చుండ్రు పోతుంది. పైన చెప్పిన ఇంటి చిట్కాలను ఫాలో అయ్యి పొడవైన మరియు ఆరోగ్యకరమైన జుట్టును మీ సొంతం చేసుకోండి.(Hair)

Join WhatsApp