Do you drink beer in winter

Alcohol Drinking: ఆరోగ్యం… ఎంతో విలువైనది. మనిషి ఆరోగ్యంగా ఉంటేనే… అన్ని పనులు చేసుకోగలుగుతాడు. ఒకవేళ అనారోగ్యం పాలైతే మనిషి అనేక సమస్యలను ఎదుర్కొంటాడు. అయితే మనం నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహార నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆల్కహాలకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

కానీ చాలామంది ఆల్కహాలు తాగేందుకే ఆసక్తి చూపిస్తారు. అది తాగితే బలం వస్తుందో తెలీదు కానీ… ఎన్ని రూపాయలు పోయినా మందు తాగాల్సిందేనని డిసైడ్ అయి ఉంటారు. ముఖ్యంగా చలికాలంలో బీర్లు తాగేందుకు కొంతమంది ఆసక్తి చూపిస్తారు. అయితే చలికాలంలో బీర్లు తాగడం హానికరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.చలికాలంలో విపరీతంగా బీర్లు తాగడం వల్ల… మూత్రశయం ఇన్ఫెక్షన్కు గురి అవుతుందని చెబుతున్నారు.

అతిగా మూత్రం వెళ్లడం వల్ల… రకరకాల సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అలాగే షుగర్ లేని వారికి కూడా షుగర్ వస్తుందట. ఈ చలికాలంలో బీర్లు తాగడం వల్ల శరీరంలోని అంతర్గత ఉష్ణోగ్రత మరింతగా పడిపోయి అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా బీపి పెరుగుతుందని చెబుతున్నారు. ఇక… ఏదైనా గాయం అయితే అస్సలు తగ్గకుండా ఉంటుంది. కాబట్టి చలికాలంలో బీర్లు తాగడం మానేయాలని వైద్యులు సూచిస్తున్నారు.

Also Read: Ash Gourd: బూడిద గుమ్మడిని ఇలా తింటే… క్యాన్సర్ తో పాటు ఆ సమస్యలకు చెక్

అయితే బీర్ల స్థానంలో రెడ్ వైన్… తాగాలని కొంతమంది చెబుతున్నారు. వైన్ తాగడం వల్ల మనసుకు కాస్త రిలాక్స్ ఉంటుందని చెబుతున్నారు కొంతమంది వైద్యులు. మందు తాగే అలవాటు ఉన్నవారు రోజుకు ఒక పెగ్గు చొప్పున వైన్ తాగాలని సూచిస్తున్నారు. బీర్ల కంటే వైన్ కాస్త బెటర్ అని చూపిస్తున్నారు. (Alcohol Drinking)

Join WhatsApp