Eat this free leaf and check all your Health problems

Health: ప్రతి ఒక్కరి ఇంటి ముందు లేదా చుట్టుపక్కల ఉండే చెట్లలో చింత చెట్టు కూడా ఒకటి. ఈ చింత చెట్టు నుంచి మనం చింతకాయలను తీసుకుంటాము కానీ చింత చెట్టుపై ఉండే చిగురుని పెద్దగా ఉపయోగించము. చింత చెట్టు నుంచి వచ్చే కాయలే కాదు.. ఆకులు కూడా వంటకాల్లో భాగం చేసుకోవాలి. చింత ఆకు మొత్తం కాకుండా.. చిగురును మాత్రమే ఆహారంగా తీసుకోవాలి.

Eat this free leaf and check all your Health problems

చింత చిగురుతో పులిహార, పప్పు, రసం, పచ్చడి మాత్రమే కాదండోయ్.. ఇంకా ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు. చికెన్, మటన్, రొయ్యలు, ఫ్రై ఫిష్ వంటకాల్లో కూడా ఈ చింత చిగురును ఉపయోగించుకోవచ్చు. పల్లెటూరులో ఫ్రీగా దొరికే ఈ చింత చిగురు ఇతర నగరాల్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే.. దీని రుచి అంతా అద్భుతంగా ఉంటుంది.

Also Read: Amala: అమల చూస్తుండగానే పాడు పని చేసిన నాగార్జున.. కోపంతో ఆమె ఏం చేసిందంటే..?

అంతేకాదు పోషక విలువలు, ఔషధ గుణాలు కూడా ఉంటాయి. ఇందులో సి విటమిన్ తో పాటు ప్రోటీన్లు, పీచు పదార్థ, క్యాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కొలెస్ట్రాల్ను కరిగించడంలో ఉపయోగపడతాయి. చింతచిగురును ఉడికించి పుక్కలిస్తే.. పంటి, గొంతు నొప్పి, మంట, వాపు ఇలా అనేక సమస్యలు తగ్గుతాయి. శరీరంలో ఎర్ర రక్త కణాల అభివృద్ధికి ఈ చింత చిగురు తోడ్పడుతుంది.

Eat this free leaf and check all your Health problems

నులి పురుగులతో బాధపడుతున్న వారు చింతచిగురు తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. థైరాయిడ్ సమస్యను తరిమికొట్టాలంటే మీకు చింతచిగురు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. అర్థరైటీస్ సమస్యతో బాధపడుతున్న వారికి చింత చిగురు తోడ్పడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంతో పాటు చక్కర స్థాయిలను తగ్గిస్తుంది. జీయర్ణ కోస సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. అందువల్ల మీకు ఇంటిదగ్గర ఫ్రీగా దొరికే ఈ చింత చిగురును ఉపయోగించి అందమైన ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి.(Health)

Join WhatsApp