Harmful Effects of Cool Drinks & Chips on Health

Health: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మన పెద్దలు. కానీ మనం మాత్రం ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా బయట ఫుడ్ ఎక్కువగా తింటున్నాం. ఏ మాత్రం ఆలోచించకుండా… నూటికి తినాలనిపించింది తినేస్తున్నాం. కానీ బయట ఫుడ్ తినడం వల్ల అనేక సమస్యలు ఉన్నాయని మొదటి నుంచి మనకు చెబుతూనే ఉన్నారు పెద్దలు.

Harmful Effects of Cool Drinks & Chips on Health

కానీ మనం వాటిని అస్సలు పట్టించుకోవడం లేదు. రుచిగా ఉంటుందని ఎక్కువగా ఆయిల్ ఫుడ్ బయటనుంచి తీసుకువచ్చి మరీ తింటున్నాం. దానివల్ల గ్యాస్ సమస్యలు అలాగే అజీర్ణ సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల సమస్యలు మనకు వస్తున్నాయి. ఇక మరికొందరైతే చిప్స్ మరియు కూల్డ్రింక్స్ విపరీతంగా తీసుకుంటూ ఉంటారు.

Also Read: Alcohol Drinking: చలికాలంలో బీర్లు సేవిస్తున్నారా?..అయితే ఇవి తెలుసుకోండి

చిన్న పార్టీ అంటూ చిప్స్ మరియు కూల్ డ్రింక్స్ తాగుతారు. అయితే ఇవి మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాంప్రదాయ తినుబండారాలకు బదులు తక్షణం అందుబాటులో ఉండే చిప్స్, బిస్కెట్స్ మరియు కూల్ డ్రింక్స్ లాంటి వాడిని అల్ట్రా ప్రాసెసింగ్ ఫుడ్స్ అని అంటారు.

అయితే ఇలాంటి చిప్స్ బిస్కెట్స్ మరియు కూల్ డ్రింక్స్ లాంటి ఆహార పదార్థాలు ఆరోగ్యానికి హానికరమని వైద్యులు సూచిస్తున్నారు. తక్షణమే వాడిని తినడం ఆపేయాలని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఫుడ్డు తింటే అనేక ప్రమాదాలు వస్తాయట. వీటితోపాటు నిల్వ ఉంచిన ప్రిజర్వేటివ్స్ దీర్ఘకాలం వాడితే క్యాన్సర్ లాంటివి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే ఈ ఫుడ్ ఐటమ్స్ డిప్రెషన్ మరియు యాంగ్జైటీని పెంచుతున్నట్లు ఇటీవల పలు పరిశోధనలు తేలింది. కాబట్టి ఇలాంటి ఫుడ్ తీసుకోకుండా జాగ్రత్తలు పడండి. (Health)

Join WhatsApp