Health Alert Do You Drink Tea More than Once a Day

Health: ప్రస్తుత కాలంలో మనం మన ఆరోగ్యంతో దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కాలుష్య వాతావరణం, కలుషితమైన ఫుడ్ కారణంగా చాలామంది అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ మన ఆరోగ్యాన్ని ఆచితూచి కాపాడుకోవాలి. అయితే అది కాదని.. ఆరోగ్యం పై దృష్టి పెట్టకుండా అన్ని రకాల ఆహారాలను విచ్చలవిడిగా తింటున్నారు. అంతేకాకుండా విపరీతంగా టీలు తాగుతున్నారు.

Health Alert Do You Drink Tea More than Once a Day

మన ఇండియాలో టికి ఉన్న డిమాండ్ అంత ఇంత కాదు. ప్రతి ఒక్కరు పొద్దున లేవగానే చాయ్ తాగడానికి ప్రయత్నాలు చేస్తారు. పొద్దున ఒకసారి… 11 గంటల సమయంలో మరొకసారి… సాయంత్రం మరో రెండు సార్లు చాయ్ లు తాగుతారు. అయితే ఒకటి కంటే ఎక్కువసార్లు చాయ్ తాగితే… చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. ఒకరోజులో ఒక్కసారి మాత్రమే టీ తాగాలని హెచ్చరిస్తున్నారు.

అలా కాదని ఒకసారి కంటే ఎక్కువ సార్లు టీ తాగితే మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. అలాగే శరీరంలో ఒత్తిడి మరియు ఆందోళన పెరుగుతుందట. ముఖ్యంగా ఆకలి పూర్తిగా చచ్చిపోతుంది. విపరీతంగా చాయ్ తాగడం వల్ల జీర్ణ సమస్యలు భారీగా పెరుగుతాయి. తద్వారా గ్యాస్ సమస్యలు మరియు మలబద్ధక సమస్యలు మధ్య ప్రమాదం ఉంటుంది.

Also Read: Toilet: టాయిలెట్‌లో ఎక్కువసేపు గడుపుతున్నారా..అయితే ఇవి తెలుసుకోండి?

షుగర్ వ్యాధిగ్రస్తులు… అసలు టీ తాగడం మంచిది కాదని చెబుతున్నారు వైద్యులు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు కూడా అసలు టీ ముట్టకూడదట. కీళ్ల నొప్పుల నుంచి… గొంతు నొప్పుల వరకు అన్ని వ్యాధులు ఈ చాయ్ వల్ల వస్తాయి. కాబట్టి పరిమితి దాటి చాయ్ తాగకూడదని… వైద్య నిపుణులు సూచిస్తున్నారు. (Health)

Join WhatsApp