Health Benefits of Goat Milk

Goat Milk: మనలో చాలామంది ఎక్కువగా గేద పాలు, ఆవు పాలు లేకపోతే ప్యాకెట్ పాలను తాగేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే మేకపాలు తాగే వాళ్ళు కూడా వందలో 2శాతం మంది ఉంటారు. మేక పాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఇందులోని పోషకాలు శరీరానికి చాలా ఉపయోగపడతాయి. అయితే మేక పాలు తాగడం వలన లభించి బెనిఫిట్స్ గురించి ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.

మేక పాలు, ఆవు పాలతో సమానంగా ఇందులో కూడా కొవ్వు పదార్థాలు ఉంటాయి. అయితే ఇవి సమ్మేళనం చిన్నవిగా ఉండడం వల్ల తొందరగా జీర్ణమవుతాయి. అందువల్ల మన శరీరంలో ఎలాంటి జీర్ణ సమస్యలు ఏర్పడవు.

Health Benefits of Goat Milk

మేక పాలలో ఎక్కువగా ఫ్యాటీ యాసీడ్స్ ఓలిగోశాఖరైడ్లు వంటి జీవ రసాయన సమ్మేళనాలు సైతం ఇందులో ఉంటాయి. ఇవి శరీరంలో ఉండేటువంటి మంట, వాపు వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

మేక పాలలో అత్యధికంగా విటమిన్ B6 ఉంటుంది.ఇది మానవుని శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కూడా మనల్ని కాపాడుతాయి.

మేక పాలు అత్యధికంగా మెగ్నీషియం లభిస్తుంది. ఇది ఒత్తిడి నుంచి తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది. అలాగే బాడీలో హ్యాపీ హార్మోన్స్ సైతం రిలీజ్ చేయడానికి మేకపాలు చాలా ఉపయోగపడతాయి. అలాగే మానసిక ఆరోగ్యంగా ఉండేలా కూడా చేస్తాయి.

Also Read: Redmi K70 Ultra: రెడ్మీ నుంచి న్యూ మొబైల్.. వావ్ అనిపించే ఫీచర్స్..!

మేక పాలలో అత్యధికంగా కాల్షియం లభిస్తుంది. ఇది ఆవుపాలకంటే చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు చాలా బలంగా తయారయ్యేలా చేస్తాయి.. అలాగే ఆస్టిమోపోరోసిస్ వంటి ఎన్నో సమస్యలను కూడా దరికి రాకుండా చేస్తాయి.

మేక పాలలో లభించేటువంటి కాల్షియం, మెగ్నీషియం వంటి వాటితో మెదడు పనితీరు చాలా మెరుగుగా ఉంటుందట. దీని ద్వారా (అల్జీమర్) వంటి మతిమరుపు సమస్యను కూడా దూరం చేస్తుంది.

మేక పాలలో చాలా అత్యధికమైన ఐరన్ లభిస్తుంది. ఇది రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిలను సైతం పెంచి రక్తహీనత నుంచి రక్షిస్తుంది. దీనివల్ల రక్తహీనతతో బాధపడేవారు ఈ మేకపాలను తాగడం చాలా ఉత్తమం. అయితే. ఇవి దొరకడం చాలా తక్కువ కాబట్టి ఎక్కువగా గేదె ఆవు పాలనే తాగడానికి ప్రజలు మక్కువ చూపుతారు. (Goat Milk)

Health Benefits of Goat Milk
Join WhatsApp