Health Benefits of Ragi and Easy Recipes

Health Benefits: మన పరిసర ప్రాంతాలలో మనకు దొరికేటువంటి వాటిలో రాగులు కూడా ఒకటి. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. ఇందులో ఎన్నో పోషకాలు కూడా లభిస్తాయి. రాగి పిండిని కానీ రాగులతో చేసిన వాటిని కానీ ప్రతిరోజు తీసుకోవడం వల్ల అధిక బరువు తో ఇబ్బంది పడేవారు బయటపడవచ్చు. అలాగే ఎముకలు దృఢంగా మారడానికి కూడా సహాయపడతాయి. అధిక రక్తపోటు వంటి సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు అంటూ వైద్యుల సైతం తెలియజేస్తున్నారు. మరి రాగులతో ఎలాంటివి చేసుకొని తినడం వల్ల ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Health Benefits of Ragi and Easy Recipes

రాగి పిండితో రకరకాల వంటలు చేసుకుని తినవచ్చు. ముఖ్యంగా రాగి సంగటి తినడం వల్ల పలు రకాల షుగర్ రాకుండా చేస్తుంది.. అలాగే రాగి జావా గానీ రాగి రొట్టెను తినడం వల్ల కూడా పలు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. రాగి లడ్డును కూడా తయారు చేసుకొని తినడం మరింత మంచిది.. రాగి అనేది గ్లూటెన్ రహిత ధాన్యం వంటిది..ఇందులో ఎక్కువగా క్యాల్షియం, ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా లభిస్తుంది.ఇది మన శరీరానికి కావలసిన క్యాల్షియం లోపాన్ని తీర్చడంలో కూడా ఉపయోగపడుతుంది.

Also Read: Tecno Spark 20: టెక్నో నుంచి సరికొత్త మొబైల్.. ఫీచర్స్ ఇవే..!

మధుమేహ వ్యాధి గ్రహస్తులు రాగి వాటితో చేసిన ఎలాంటి పదార్థాన్ని తిన్నా సరే చాలా మేలు చేస్తాయి.. ముఖ్యంగా రాగి రొట్టెలను రెండు వైపులా చక్కగా కాల్చుకొని తినడం వల్ల త్వరగా ఆకలి వేయదట. అంతేకాకుండా రాగి పిండితో చేసిన వాటిని తినడం వల్ల శరీరంలో ఉండేటువంటి కొవ్వు పదార్థాలను కరిగించడమే కాకుండా షుగర్ లెవల్స్ ను కూడా తగ్గిస్తుంది. షుగర్ పేషెంట్లకు పౌష్టిక ఆహారం వలె రాగి లడ్డూలను కాని రాగి రొట్టెలు కానీ రాగి జావా కానీ తినవచ్చు.

Health Benefits of Ragi and Easy Recipes

అంతేకాకుండా రాగులతో తయారు చేసినటువంటి వాటిని తినడం వల్ల కీళ్ల నొప్పులకు కూడా మంచి దివ్య ఔషధం గా ఉపయోగపడుతుంది. రాగి పిండితో బిస్కెట్లు పకోడాలు వంటివీ చేసుకొని తినడం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి.. కనీసం ఐదు సంవత్సరాల వయసు ఉన్న పిల్లలనుంచి ఇవి తినిపిస్తే ఖచ్చితంగా వారి ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. (Health Benefits)

Join WhatsApp