Health Benefits With Boti Curry

Health: మాంసాహారం… తినేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తారు. ఈ మధ్యకాలంలో వారంలో నాలుగు రోజులు మాంసాహారం తినే జనాలు కనిపిస్తున్నారు. ఆదివారం వస్తే ప్రతి ఒక్కరి ఇంట్లో కచ్చితంగా చికెన్ లేదా మటన్ అది కాకపోతే చేపలు ఇలా ఎన్నో రకాల మాంసాహారాలను తినేస్తున్నారు. అయితే మాంసాహారాలలో చికెన్ తింటే ఇబ్బందులు ఉంటాయని చాలామంది మటన్ తింటారు. మటన్ లో ఉన్న ప్రతి ఐటమ్ తినేస్తూ ఉంటారు.

Health Benefits With Boti Curry

అయితే మటన్ ధర ఎనిమిది వందల రూపాయలు ఉన్న నేపథ్యంలో కొంతమంది మేక నుంచి వచ్చే బోటి కొనుగోలు చేస్తారు. బోటి తింటే ఎంతో ఆరోగ్యమని మన పెద్దలు చెబుతూ ఉంటారు. మంచి విటమిన్లు అందుతాయని మనకు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు మన పెద్దలు. అయితే ఈ బోటి కూర తినడం వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. బోటి కూర తినడం వల్ల… మనకు అనేక రకాల పోషకాలు అందుతాయి.

Also Read: Health: చిప్స్, కూల్ డ్రింక్స్‌ తీసుకుంటున్నారా..తస్మాత్‌ జాగ్రత్త?

మేకలు లేదా గొర్రెలు తినే గడ్డి దాని పేగుల ద్వారా జీర్ణం అవుతుంది. ఈ నేపథ్యంలోనే గడ్డి నుంచి వచ్చే అనేక మూలకాలు ఆ పేగులకు పట్టి ఉంటాయి. దీంతో మనం తినే బోటి వల్ల మన శరీరానికి అన్ని మూలకాలు దొరుకుతాయి. అలాగే మటన్ కంటే బోటి తొందరగా జీర్ణం అవుతుంది. తద్వారా గ్యాస్ సమస్యలు కూడా తొలగిపోతాయి.

Health Benefits With Boti Curry

మలబద్ధక సమస్య కూడా మనకు అస్సలు రాకుండా చూసుకుంటుంది ఈ బోటి. రక్త ప్రసరణ కూడా బాగా అయ్యేలా ఇది చూస్తుంది. గర్భిణీ స్త్రీలు బోటీ ఎక్కువగా తినాలని వైద్యులు కూడా చెబుతారు. గర్భిణీ స్త్రీలు బోటు ఎక్కువగా తింటే రక్తం పుడుతుంది. అలాగే గుండెపోటు మరియు షుగర్ ఉన్నవారు కూడా చికెన్, మటన్ కంటే బోటి ఎక్కువగా తినాలని వైద్యులు సూచిస్తున్నారు. కాబట్టి ఏ విధంగా చూసినా మనకు బోటీ వల్ల అనేక ఉపయోగాలు ఉంటూనే ఉన్నాయి. (Health)

Join WhatsApp