Tamarind Leaves: ప్రస్తుత కాలంలో చాలామంది ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కలుషిత వాతావరణం అలాగే కలుషిత ఆహారం ఇప్పుడు ఉంటున్న నేపథ్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు హెల్తీ ఫుడ్ తింటున్నారు జనాలు. మన పెద్ద వారి కాలంలో తిన్నటువంటి ఫుడ్ ను ఇప్పుడు తయారు చేసుకుంటున్నారు కొంతమంది. ఎలాగో అలాగా తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మంచి ఆహారాన్ని తయారు చేసుకొని ఆసుపత్రి బిల్లును తగ్గించుకుంటున్నారు. Tamarind Leaves

Health Benfits With Tamarind Leaves

అయితే ప్రస్తుత కాలంలో చింతచిగురు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చింతచిగురు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చింత చెట్టుకు లేతగా ఈ చింతచిగురు ఉంటుంది. దాన్ని తెంపి మనం కూర వండుకొని తినవచ్చు. లేదా ఉడకబెట్టుకొని తినవచ్చు. నేరుగా కూడా మూడు పూటలా చిటికెడు చిటికెడు తినవచ్చు. ఈ మూడు విభాగాల్లో ఎలా తిన్నా కూడా మనకు ఆరోగ్యమే. Tamarind Leaves

Also Read: Wheat Flour Mysore Bajji: మైసూర్ బజ్జీలు తింటున్నారా… అయితే 100 రోగాలు రావడం ఖాయం ?

ఇక ఈ చింత చిగురు తినడం వల్ల గొంతు నొప్పి వెంటనే తక్కువవుతుంది. అలాగే నాలుక పగుళ్లు, పెదవు పలగడం లాంటి సమస్యలు రాకుండా కూడా ఈ చింతచిగురు కాపాడుతుంది. సింపుల్గా చెప్పాలంటే నోటికి సంబంధించిన ఎలాంటి వ్యాధులను అయినా చిటికలో నయం చేస్తుంది చింతచిగురు. అలాగే ఈ చింత చిగురు తినడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా మనం తిన్న ఆహారం వెంటనే జీర్ణం అవుతుందట. Tamarind Leaves

అలా అన్నం జీర్ణం అయితే మలబద్ధక సమస్య కూడా పూర్తిగా తగ్గిపోతుందని చెబుతున్నారు వైద్యులు. అంతేకాకుండా ఎస్డిటి సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయట. ఈ చింత చిగురు తినడం వల్ల గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటుందట. షుగర్ వ్యాధులు ఉన్నవారు కూడా చింతచిగురు తినాలని చెబుతున్నారు వైద్యులు. కీళ్ల నొప్పులు మరియు వాపులు కూడా తగ్గిపోతాయట. Tamarind Leaves

Join WhatsApp