Health Issues With Pani Puri

Pani Puri: ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చాలా మంది విశ్వప్రయత్నాలు చేస్తారు. హెల్తి ఫుడ్ తీసుకొని… ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది ఆకుకూరలు తిని విటమిన్స్ సంపాదించుకుంటారు. మరికొంతమంది మాంసకృత్తులు ఎక్కువగా తీసుకుంటారు. అంటే చికెన్ లేదా మటన్ తిని ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తారు. ఇక మరికొంతమంది ఫ్రూట్స్ లాంటివి తీసుకొని ఎనర్జీగా ఉంటారు. Pani Puri

Health Issues With Pani Puri

ఇక మరి కొంతమంది మాత్రం చాలా వింతగా ప్రవర్తిస్తారు. ఆరోగ్యం పట్ల ఎలాంటి దృష్టి పెట్టకుండా నచ్చినది తినేస్తారు. నోటికి ఏది కమ్మగా ఉంటే అది నమలిస్తారు. బయట ఫుడ్ ఎక్కువగా తీసుకొని అనారోగ్య పాలవుతారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జనాలు పానీ పూరి అనే పదార్థానికి బాగా అలవాటైపోయారు. ఈ పానీ పూరి తింటే ఏదో బలం వస్తుందని… ప్రతిరోజు తినే ప్రయత్నం చేస్తారు కొంతమంది. అయితే ఈ పానీ పూరి తినడం వల్ల రోగాలు తప్ప ఎలాంటి లాభాలు లేవని సర్వే సంస్థలు అలాగే వైద్య నిపుణులు చెబుతున్నారు. Pani Puri

Also Read: Tamarind Leaves: చింత చిగురు తింటున్నారా… అయితే ఈ విషయాలు తెలుసుకోండి !

దేశవ్యాప్తంగా పానీపూరి దుకాణాలు ఉన్నన్ని ఏ దుకాణాలు లేవని సర్వేలు వెల్లడించాయి. దీనికి కారణం ప్రతి ఒక్కరు పానీపూరి తినడం అలవాటు చేసుకోవడమే. అయితే ఈ పానీ పూరి తినడం వల్ల మొట్టమొదటగా మనం తిన్న ఆహారం అస్సలు జీర్ణం కాదు. దాని ద్వారా మలబద్ధకం అలాగే అతి విరోచనాలు కూడా జరుగుతాయి. ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్ సమస్య వస్తుంది. పానీ పూరిలో చింతపులుపు ఉంటుంది కనుక… అన్నం జీర్ణం కాక వాంతులు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. Pani Puri

ఇక గుండె జబ్బు షుగర్ వ్యాధులు ఉన్నవారు ఈ పానీ పూరి తింటే పడక వేయడం కాయం. ఈ రెండు జబ్బులు ఉన్నవారు అస్సలు కూడా పానీ పూరి తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈ పానీ పూరి తినడం వల్ల…. సూక్ష్మజీవులు శరీరంలోకి చొచ్చుకొని వెళ్తాయి. దీనివల్ల విష జ్వరాలు వస్తాయి. ముఖ్యంగా జలుబు అలాగే గొంతు సమస్యలు కూడా తలెత్తుతాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో పానీ పూరి తినడం కంటే ఇంట్లో పడుకోవడం మేలని వైద్యులు సూచిస్తున్నారు.Pani Puri

Join WhatsApp