Health Issues With Use of laptop and mobile

Health: ప్రస్తుత కాలంలో టెక్నాలజీ విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. టెక్నాలజీ పెరిగిన కొద్దీ జనాలు కూడా పూర్తిగా మారిపోతున్నారు. టెక్నాలజీకి తగ్గట్టుగానే తమ రోజువారి పనులను చేసుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్లు వాడడం అలాగే లాప్టాప్స్ వాడడం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఉద్యోగం నిమిత్తం స్మార్ట్ ఫోన్స్ మరియు లాప్టాప్స్ విపరీతంగా వాడుతున్నారు. అయితే స్మార్ట్ ఫోన్స్ మరియు లాప్టాప్స్ విపరీతంగా వాడటం వల్ల అనేక సమస్యలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Health Issues With Use of Laptop and Mobile

దీనివల్ల అనేక ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా ల్యాప్టాప్ లు మరియు స్మార్ట్ ఫోన్స్ మహిళలు వాడకూడదని సూచిస్తున్నారు. మహిళలలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వీటిని వాడుతున్నారు. అయితే మహిళలు వీటిని ఎక్కువగా వాడటం వల్ల పిల్లలు కనే శక్తిని కోల్పోతారని హెచ్చరిస్తున్నారు వైద్యులు. లాప్టాప్స్ మరియు స్మార్ట్ ఫోన్స్ నుంచి విడుదలయ్య రేడియేషన్ మహిళల శరీరంలోకి వెళ్లి.. గర్భం దాల్చకుండా చేస్తుందని చెబుతున్నారు.

Also Read: Health: రోజులో ఒక్కసారి కంటే ఎక్కువగా టీ తాగుతున్నారా? అయితే..ప్రమాదమే !

కాబట్టి కొత్తగా పెళ్లి అయిన వారు… పిల్లలను కనని వారు…. లాప్టాప్ లు మరియు స్మార్ట్ ఫోన్స్ తక్కువగా వాడాలని హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో పురుషులు కూడా వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఒకవేళ విపరీతంగా పురుషులు వాడిన… స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా లాప్టాప్ లు ముందట పెట్టుకొని కూర్చుంటే నడుము నొప్పులు కూడా వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు.

మన కళ్ళకు ఎఫెక్ట్ పడుతుందని కూడా జాగ్రత్తలు చెబుతున్నారు వైద్యులు. లాప్టాప్ లు మరియు స్మార్ట్ ఫోన్లు వాడేటప్పుడు మహిళలు అలాగే పురుషులు కచ్చితంగా ఏదైనా కళ్ళ అద్దాలు వాడాలి. విపరీతంగా స్మార్ట్ ఫోన్స్ మరియు లాప్టాప్ లు వాడితే కాళ్ల నొప్పులు అలాగే మెడ నరాల సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. కాబట్టి లాప్టాప్ లు మరియు స్మార్ట్ ఫోన్స్ పట్ల మహిళలతో పాటు పురుషులు కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. (Health)

Join WhatsApp