Is Drinking Cold Water Bad for You

Fridge Water: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో చాలా విలువైన వస్తువులు ఉంటున్నాయి. గతంలో లాగా.. ఏదీ లేని ఇల్లు ఉండటం లేదు. ఫ్రిడ్జ్, టీవీ, ఏసీ లేదా కూలర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల వస్తువులు మన ఇంట్లో ఉంటాయి. అయితే ముఖ్యంగా ఫ్రిడ్జ్ చాలామంది వాడుతారు. కూరగాయలు చెడిపోకుండా తాజాగా ఉంచుకునేందుకు ఫ్రిడ్జ్ వాడతారు. Fridge Water

Is Drinking Cold Water Bad for You

అంతేకాకుండా పాలు, పెరుగు కూడా ఫ్రీజ్ లో పెట్టి వాడుతారు. ఈమధ్య కోడిగుడ్లు కూడా ఫ్రిజ్లో పెట్టి వాడేస్తున్నారు. తెల్లారితే చెడిపోతుంది అనే వస్తువు ఉంటే చాలు ఫ్రిజ్లో పెట్టేస్తున్నారు. అయితే కొంతమంది కాలంతో సంబంధం లేకుండా విపరీతంగా కూల్ వాటర్ తాగుతారు. ఫ్రిజ్లో గడ్డలు కట్టిన వాటర్ కూడా తాగే వారు ఉన్నారు. ఎండాకాలం అంటే పోనీ అనుకుంటే.. చలికాలం అలాగే వర్షాకాలం కూడా చల్లటి ఫ్రిడ్జ్ వాటర్ తాగుతున్నారు.

Also Read: Health Benefits: కౌగిలించుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా?

అయితే ఫ్రిజ్లో పెట్టిన వాటర్ తాగడం వల్ల మనకు అనేక రకాల వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాస్త జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదం తప్పదని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఫ్రిడ్జ్ లో వాటర్ తాగడం వల్ల… గొంతు సమస్యలు, దగ్గు అలాగే జలుబు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ ఫ్రిడ్జ్ లో పెట్టిన వాటర్ తాగడం వల్ల మన పళ్లకు ఉన్న పవర్ తగ్గిపోతుంది.Fridge Water

చల్లటి నీరు పంటికి తాకడంతో జువ్వుమని మనకు అనిపిస్తుంది. అప్పుడే పంటికి సమస్య వచ్చినట్లు. కాబట్టి చల్లటి నీటిని తాగకుండా ఉండండి. అలాగే చల్లటి నీరు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. తద్వారా గ్యాస్ అలాగే మలబద్ధక సమస్య తలెత్తుతుంది. వీటివల్ల మనకు కాళ్ల నొప్పులు నడుము నొప్పులు వచ్చే ప్రమాదం ఉంటుంది.Fridge Water

ఇలాంటి తరుణంలో ఫ్రిడ్జ్ వాటర్ కంటే నార్మల్ వాటర్ తాగింది బెటర్. ఒకవేళ చల్లటి నీరు తాగాలనుకుంటే కుండలో పోసుకొని… చల్లగా అయ్యాక తాగాలి. అలా తాగితే మనకు ఆరోగ్యంతో పాటు మంచి మినరల్స్ శరీరానికి అందుతాయి. ఇకనైనా ఫ్రిడ్జ్ వాటర్ ఆపేసి… కుండలో చల్లటి నీరు పోసుకొని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. Fridge Water

Join WhatsApp