Nestle India mixing excess sugar in Cerelac over childrens

Nestle Cerelac: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మన పెద్దలు. కానీ మనం ఆరోగ్యం పట్ల ఏమాత్రం దృష్టి పెట్టకుండా ఇష్టం వచ్చినట్లు బయట ఆహారాన్ని తింటాం. మనం తినడమే కాకుండా పిల్లలకు కూడా వాటిని పెడతాం. దానివల్ల ఇంట్లో ఉన్న వారందరికీ అనేక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ఖచ్చితంగా జాగ్రత్త ఉండాలి. లేకపోతే చాలా కష్టం అవుతుంది. అయితే తాజాగా చిన్నపిల్లల విషయంలో ఓ సంచలన విషయం తెలుగులోకి వచ్చింది. Nestle Cerelac

Nestle India mixing excess sugar in Cerelac over childrens

స్విస్ కంపెనీ నేస్లే మ్యాగీ సరికొత్త వివాదంలో చిక్కుకుంది. నెస్లే కంపెనీ బేబీ ఫుడ్స్ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. నెస్లే కంపెనీ ఆధ్వర్యంలో సెరెలాక్ లాంటి బేబీ ఫుడ్స్ మార్కెట్లో విపరీతంగా వికయాలు జరుపుకుంటున్నాయి. అయితే ఈ ప్రొడక్ట్స్ లో ఎక్కువ శాతం చక్కెర కలుస్తోందట. వాస్తవానికి ఏడాదిలోపు చిన్నపిల్లలలో చక్కెర అస్సలు ఉండకూడదు. వారు తినే ఫుడ్డు నుంచి పాలవరపు ఎక్కడా కూడా చక్కెర కలవకూడదు. Nestle Cerelac

Also Read: Elaichi Benefits: యాలకులు తింటున్నారా…అయితే మీకు తెలియని మైండ్ బ్లోయింగ్ నిజాలు

కానీ ఈ ప్రొడక్ట్స్ లో ఏకంగా మూడు గ్రాముల చక్కెర కలుస్తోందట. ఈ విషయాన్ని తాజాగా ఓ సర్వే సంస్థ వెల్లడించింది. అయితే చక్కర కలవడం వల్ల చిన్న పిల్లల భవిష్యత్తులో దీర్ఘకాలిక వ్యాధులు అలాగే ఊబకాయం వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి ఫుడ్ పెట్టకపోవడం మంచిదని చెబుతున్నారు. అంతేకాకుండా చక్కెర ఎక్కువగా ఉన్నా పదార్థాలు తినడం వల్ల పిల్లల శారీరక అలాగే మానసిక ఆరోగ్యం పూర్తిగా చెడిపోతుందని చెబుతున్నారు వైద్యులు. Nestle Cerelac

ముఖ్యంగా చిన్నపిల్లలకు ప్యాకేజ్ ఫుడ్ అసలు ఇవ్వకూడదని సూచిస్తున్నారు. ఏడాది లోపు పిల్లలందరికీ కచ్చితంగా పాలు పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే జంక్, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని కూడా అస్సలు పిల్లలకు ఇవ్వకూడదు. బయట కొనుక్కొని వచ్చే ఆహారం కంటే ఇంట్లో దొరికే… ఇంట్లో వండిన ఆహారాన్ని తినిపించాలని సూచిస్తున్నారు వైద్యులు. Nestle Cerelac

Join WhatsApp