Risks of Drinking Alcohol in Cold Weather

Alcohol: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఆల్కహాల్ కి బానిస అయిపోయారు. సమయం సందర్భం లేకుండా ఆల్కహాల్ ని సేవిస్తూ మత్తులో బతుకుతున్నారు. ఇక అదే విధంగా చలికాలంలో చలి నుంచి రక్షించుకోవడానికి కూడా కొందరు ఆల్కహాల్ ని సేవిస్తున్నారు. ఆల్కహాల్ తాగడం వల్ల చర్మం వేడవుతుందని అనంతరం పెద్దగా చలివేయదని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు.

Risks of Drinking Alcohol in Cold Weather

ఈ మూలంగా మరికొందరు ఆల్కహాల్ కి బానిసలు అవుతున్నారు. ఇక చలికాలంలో ఆల్కహాల్ తాగే వారిపై నిపుణులు కొన్ని సూచనలను వెల్లడించారు. చలికాలంలో ఆల్కహాల్ తాగడం కారణంగా గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా ఆల్కహాల్ ని సేవించడం కారణంగా అంతర్గత ఉష్ణోగ్రత మరింతగా పెరగడం తో రక్తనాళాలు సంకోచించడం లాంటివి జరుగుతాయి.(Alcohol)

Also Read: Meizu 21 Pro: Meizu నుంచి సరికొత్త మొబైల్.. 50mp కెమెరా..!

ఇవే కాకుండా లివర్లు డ్యామేజ్ అవ్వడం మరియు తలలో అనేక సమస్యలు ఏర్పడడం లాంటివి జరుగుతాయి. సాధారణంగా చలికాలంలో గుండెపోటుతో మరణించిన వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి ఓ మూల కారణం ఆల్కహాల్ కూడా. ఉష్ణోగ్రత తగ్గడం వల్ల రక్తపోటు పెరగడం కూడా చాలా సాధారణ సమస్య అయిపోయినప్పటికీ.. శీతాకాలంలో శారీరక శ్రమ లేకపోవడం.. ఇతర కారణాల వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇక వృద్ధుల్లో ఈ సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. అందువల్ల చలికాలంలో ఆల్కహాల్ నివారించండి. లేదంటే మీ ప్రాణాలకే ముప్పు.

Risks of Drinking Alcohol in Cold Weather
Join WhatsApp