Sugar Cane Juice Side Effects in Summer

Sugar Cane Juice: ఎండాకాలం వచ్చేసింది. బయట కాలు పెడదామంటే అందరూ వణికిపోతున్నారు. క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు కూడా దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా మండుటెండలే కనిపిస్తున్నాయి. దీంతో వడదెబ్బలు… చెమట, తీవ్ర అనారోగ్యాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక తీవ్రమైన ఎండలు కొడుతున్న నేపథ్యంలో చాలామంది బయట అడుగుపెట్టడం లేదు. ఏదైనా ఎమర్జెన్సీ పని ఉంటే తప్ప బయటకి వెళ్లడం లేదు. కొంతమంది సాయంత్రం పూట ఎండ చల్లబడ్డ తర్వాత వెళ్తున్నారు.Sugar Cane Juice

Can’t stand the sun and drink sugarcane juice

ఇక ఎండ తీవ్రతలు బాగా ఉండటంతో ఏసీలు అలాగే ఫ్యాన్లు, కూలర్లు విపరీతంగా వాడేస్తున్నారు జనాలు. ఏదో ఒకలాగా ఈ ఎండ తీవ్రతను తట్టుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మరి కొంతమంది ఎండకు బయటకు వెళ్లిన తర్వాత చల్లటి నీళ్లు లేదా చల్లటి చెరకు రసం తాగుతున్నారు. మరి కొంతమంది ఫ్రిజ్లో ఉన్న వాటర్ తాగి కాస్త రిలాక్స్ అవుతున్నారు. అయితే ప్రస్తుతం బయట దొరికే చెరకు రసం తాగితే చాలా డేంజర్ అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.Sugar Cane Juice

Also Read: Mother Milk: చిన్నపిల్లలకు తల్లిపాలు పడుతున్నారా..అయితే ఆ క్యాన్సర్‌ తప్పదా ?

బయట దొరికే చెరుకు రసం అంత మంచిది కాదని చెబుతున్నారు. ఎందుకంటే ఆ చెరకు రసం చేసేటప్పుడు… ఐస్ గడ్డలు వాడుతారు. అయితే ఆ ఐస్ గడ్డలు వాడటం వల్ల మనకు చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ రెండిటి మిశ్రమం తాగడం వల్ల వేడి విపరీతంగా పెరుగుతుందట. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా అభిపరితంగా ఉంటాయట. ముఖ్యంగా తలనొప్పులు వస్తాయని చెబుతున్నారు వైద్యులు. Sugar Cane Juice

ఇంకా షుగర్ అలాగే బీపీ వ్యాధులు ఉన్నవారు ఈ చెరుకు రసాన్ని తాగితే మరింత ప్రమాదాన్ని చవిచూస్తారట. అలాగే ఈ ఎండ దెబ్బకు విష జ్వరాలు కూడా వస్తాయట. జలుబు లేదా దగ్గు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. అలాగే బయట ఐస్ గడ్డలు వేసిన ఎలాంటి ఫ్రూట్ జ్యూస్ కూడా తాగకుండా ఉంటే మంచిదని చెబుతున్నారు. అలాంటి జ్యూస్ ఏమైనా ఉంటే ఇంట్లో చేసుకొని తాగితే బెటర్ అని చెబుతున్నారు వైద్యులు. Sugar Cane Juice

Join WhatsApp