These Things You Should Know About Mouthwash

Mouthwash: ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి… మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఛాన్స్ దొరికిన సమయంలో హెల్త్ టిప్స్ పాటిస్తూ ఉంటాం. మంచి పోషక ఆహారాలు తినడం… డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవడం మనం చేస్తూ ఉంటాం. అంతేకాకుండా రకరకాల ద్రవ పానీయాలు తీసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. అయితే మనం తీసుకున్న ఆహారం కారణంగా…. తెల్లవారి లేవగానే మన నోట్లో నుంచి స్మెల్ వస్తుంది.Mouthwash

These Things You Should Know About Mouthwash

అయితే ఆ దుర్వాసన తొలగిపోయేందుకు మనం బ్రష్ చేస్తాం. కొంతమంది బ్రష్ తో పాటు మౌత్ వాష్ కూడా చేస్తారు. మెడికల్ షాప్ లలో దొరికే మౌత్ వాష్ లను తీసుకువచ్చి… నోరు కడుక్కుంటూ ఉంటారు. ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి అలాగే సాయంత్రం ఒకసారి ఇలా మూడు పూటలా కొంతమంది మౌత్ వాష్ చేస్తారు. అయితే మార్కెట్లో దొరికే మౌత్ వాష్ లు వాడటం వల్ల… మనకు అనేక రకాల సమస్యలు వస్తాయని… వైద్యులు హెచ్చరిస్తున్నారు.Mouthwash

Also Read: Coconut water: కొబ్బరి నీళ్లు తాగుతున్నారా… తస్మాత్ జాగ్రత్త.. ఈ సమస్యలు తప్పవు !

నిత్యం మౌత్ వాష్ చేయడం వల్ల… నోరు ఎండిపోతుందట. అలాగే మౌత్ వాష్ లలో ఉండే ద్రావణాలు మన నోటిలో ఉండే అనేక పోషకాలను చంపేస్తాయట. తద్వారా మన నోరు ఎలాంటి లవణాలు లేకుండా.. క్షీణ వ్యవస్థలోకి వెళుతుందట. కొంతమంది నోటిలో రక్తం కూడా వస్తుందట. ముఖ్యంగా ఈ మౌత్ వాష్లు వాడటం వల్ల క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మౌత్ వాష్ లిక్విడ్ ల నుంచి అనేక రకాల మూలకాలు మన నోటిలోకి వెళ్తాయట. క్రమేనా ఆ మూలకాలు నోటి క్యాన్సర్ కు కారకాలు అవుతాయట. ఇదే విషయాన్ని వైద్యులు హెచ్చరించి చెప్తున్నారు. అంతేకాకుండా మౌత్ వాష్ ఉపయోగించడం వల్ల… మన దంతాలు ఎల్లో కలర్ లోకి మారిపోతాయట. దంతా క్షయ మరియు చిగుళ్ల నొప్పి వల్ల దంతాలు రంగు మారతాయని వైద్యులు సూచిస్తున్నారు. అందుకే…మౌత్ వాష్ లు వాడకూడదని వైద్యులు సూచిస్తున్నారు. అంత అవసరం అనుకుంటే వేప పుల్లలు నమిలితే ఇంకా మంచిదని చెబుతున్నారు.Mouthwash

Join WhatsApp