What are the benefits of keeping a Crystal Turtle at home

Crystal Turtle: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో క్రిస్టల్ తాబేలు బొమ్మ ఉంచితే చాలా మంచిదని నమ్ముతూ ఉంటారు. దీనివల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయని గట్టిగా నమ్ముతారు. మీరు పడుకునే బెడ్ కు దగ్గర్లో క్రిస్టల్ తాబేలు ఉంచడం వల్ల మంచి నిద్ర పడుతుందని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఇది నిద్రలేమి సమస్యను దూరం చేస్తుందట. ప్రశాంతత చేకూర్చి మీకు మంచి నిద్రను కలిగిస్తుంది.

What are the benefits of keeping a Crystal Turtle at home

వాస్తు ప్రకారం పూజ గదిలో పసుపు బట్టల్లో ఈ క్రిస్టల్ తాబేలు ఉంచడం వల్ల అంతా శుభం జరుగుతుందని పూర్వకాలం నుంచి పెద్దలు చెబుతూ వస్తున్నారు. మీకు అదృష్టాన్ని చేకూర్చడంలో క్రిస్టల్ తాబేలు సహాయ పడుతుందని చెబుతున్నారు. ఇక మీరు ఆర్థికంగా ఎదిగేందుకు ఇది సహాయపడుతుంది. మీ ఇంటి ద్వారా దగ్గర్లో ఈ క్రిస్టల్ తాబేలు ఉంచడం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది.

Also Read: Heroine: దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్.. 28 కిలోల బంగారం,వేలకోట్ల ఆస్తులు.. ఎవరంటే..?

పాజిటివ్ ఎనర్జీని పెంచడంలో ఇది సహాయపడుతుంది. అదేవిధంగా ఇంట్లో గొడవలను నివారించి మిమ్మల్ని ప్రశాంతంగా మార్చేందుకు ఈ క్రిస్టల్ తాబేలు సహాయపడుతుంది. దీని కోసం మీ హాల్ లేదా లివింగ్ రూమ్ లో ఈ తాబేలు బొమ్మ ఉంచాలి. మీ ఇంట్లో లేదా మీరు పని చేసే ఆఫీస్ డస్పై ఈ క్రిస్టల్ తాబేలు పెడితే చాలా మంచిదట. ఇక ఇది మీ కెరీర్ గ్రోత్ కి కూడా బాగా ఉపయోగపడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం దిశను బట్టి ఈ క్రిష్టల్ తాబేలు ఉంచాలి.

What are the benefits of keeping a Crystal Turtle at home

అదేవిధంగా అవి తయారుచేసిన పదార్థాన్ని బట్టి కూడా దిశ మారుతూ ఉంటుంది. చెక్కతో తయారు చేసిన తాబేలు బొమ్మను తూర్పు లేదా ఆగ్నేయం లో ఉంచాలి. లోహంతో తయారుచేసిన తాబేలు బొమ్మలు ఉత్తరం లేదా వాయొవ్యులో ఉంచాలి. ఇలా మీరు ఎంచుకున్న తాబేలును బట్టి దిశలు మారుతాయి. ఇక ఈ తాబేలు ఇంట్లో పెట్టుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలు కూడా రావు. అందువల్లే ప్రతి ఒక్కరూ ఈ క్రిస్టల్ తాబేలు తమ గృహంలో ఉంచుకుంటారు.(Crystal Turtle)

Join WhatsApp