Worried about Iron deficiency?

Iron: చాలామందికి రెగ్యులర్గా చమటలు పట్టడం మరియు అలసిపోవడం, కళ్ళు తిరగడం వంటి సమస్యలు ఏర్పడతాయి. వీటన్నిటికీ కారణం ఐరన్ లోపం. మన బాడీలో సరైన ఐరన్ పోషకం లేకపోతే ఈ విధంగా జరుగుతుంది. ఐరన్ ని పెంచుకునేందుకు కొన్ని ఆహారాలను తీసుకుంటే చాలని నిపుణులు చెబుతున్నారు. ఐరన్ పెరుగుదల కోసం ఎన్ని టాబ్లెట్స్ వాడిన పెద్దగా ఫలితం కనిపించదు.

Worried about Iron deficiency?

ఎందుకంటే ఐరన్ అనేది సహజ పద్ధతిలో పెంచుకోవాల్సిన పోషకం. కనుక ఈ ఐరన్ ని తినే ఆహారం నుంచే సరి చేసుకోవాలి. కొన్ని ఆహారాలు తీసుకోవడం ద్వారా ఈ ఐరన్ లోపం కలగదు. అందులో బీట్రూట్ కూడా. బీట్రూట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనిని రెగ్యులర్ గా తింటే ఐరన్, హిమోగ్లోబిన్ పెరుగుతుంది. అదేవిధంగా దానిమ్మ పండ్లలో కూడా ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీనిని తరచూ తినడం ద్వారా శరీరానికి కావాల్సిన ఐరన్ లభిస్తుంది.

Also Read: Keerthy Suresh: ఆ నైట్ రణ్ వీర్ తో ఆమె బాగా ఎంజాయ్ చేసిందంటూ సీక్రెట్ లీక్ చేసిన కీర్తి సురేష్..!

ఇక మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఆహారం బచ్చల కూర. బచ్చల కూర ఒక్క ఐరన్ నే కాదు అనేక విటమిన్లు మరియు క్యాల్షియంని అందిస్తుంది. ఇది ఐరన్ పెంచడంలో తోడ్పడుతుంది. రెడ్‌మీట్ లో ప్రోటీన్లు మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఐరన్ లోపం ఉన్నవారికి బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా పప్పు దినుసుల్లో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది.

Worried about Iron deficiency?

ఇక ఇవే కాకుండా గుడ్డు, గుమ్మడి గింజలు, ఉల్లిపాయలు ఇలా కొన్ని ఆహారాలలో మాత్రమే ఐరన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఆహారాలను కనుక మీ డైలీ రొటీన్ లో చేర్చుకుంటే ఐరన్ లోపం నుంచి విముక్తి పొందవచ్చు. ప్రస్తుత కాలంలో కలిగే ఐరన్ లోపం ద్వారా పిల్లలు పుట్టకపోవడం మరియు సరైన శక్తి లేక అనేక అనారోగ్యాల సమస్యల బారిన పడడం వంటివి జరుగుతున్నాయి. అందువల్ల ఐరన్ ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. ఇక ఈ ఆహారాలను తీసుకుంటే మీరు తప్పనిసరిగా ఐరన్ ని పెంచుకోవచ్చు.(Iron)

Join WhatsApp