100 seats for YCP From there cm Jagan oath

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సోమవారం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు పోలింగ్ శాతం నమోదు అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 82% వరకు ఎన్నికల పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. అయితే ఓటింగ్ శాతం పెరగడంతో తెలుగుదేశం పార్టీకి అధికారం రాబోతుందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. CM Jagan

100 seats for YCP From there cm Jagan oath

అయితే వాస్తవంగా… ఇతర రాష్ట్రాలు అలాగే విదేశాలలో ఉన్న ఓటర్లు ఏపీకి వచ్చి తెలుగుదేశం కూటమికి ఓటు వేశారని సర్వేలు చెబుతున్నాయి. అదే గ్రామీణ ప్రజలు మాత్రం గంపగుత్తగా వైసీపీకి ఓటు వేసినట్లు స్పష్టం అవుతోంది. ఏపీలోని అన్ని గ్రామాల్లో… ఎవరిని కదిలించిన వైసీపీకి ఓటు వేసామని స్పష్టం చేశారట. అదే పట్టణ ప్రాంతాలలో… కొంతమంది వైసీపీకి అలాగే కొంతమంది తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని టీవీ9 చీఫ్ రజినీకాంత్ కూడా స్పష్టం చేశారు. CM Jagan

Also Read: BRS: కాంగ్రెస్‌ పార్టీలో కేసీఆర్‌ పార్టీ విలీనం ?

ఆయన అభిప్రాయం ప్రకారం…. ఏపీలో వైసీపీ పార్టీ సెంచరీ కొట్టడం ఖాయమని చెబుతున్నారు. వందకు పైగా సీట్లు వైసిపి సొంతం చేసుకుంటుందని ఆయన తెలిపారు. దానికి తగ్గట్టుగానే వైసిపి పార్టీ గ్రౌండ్ స్థాయిలో కష్టపడింది. జగన్మోహన్ రెడ్డి ఒంటరి అయినప్పటికీ… అన్ని నియోజకవర్గ ప్రజలను టచ్ చేశారు. అందరూ కలిసి తనను ఒంటరి చేశారని… అనేక సంక్షేమ పథకాలను నేను అందిస్తున్నానని బలంగా జనాల్లోకి తీసుకువెళ్లారు జగన్మోహన్ రెడ్డి. CM Jagan

ఈ తరుణంలో చాలామంది ఓటర్లు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలుస్తుందని బొత్స సత్యనారాయణ కూడా స్పష్టం చేశారు. విశాఖలో జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ ప్రక్రియను ఎవరు ఆపలేరని వెల్లడించారు. దీంతో వైసిపి పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. CM Jagan

Join WhatsApp