16 BRS MLAs into Congress party

Congress: తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఖరారు అయిన నేపథ్యంలో అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని రంగం సిద్ధం చేసుకుంటున్నాయి అన్ని పార్టీలు. ముఖ్యంగా అధికారంలోకి ఇటీవల వచ్చిన కాంగ్రెస్ పార్టీ… ఎక్కువ పార్లమెంటు స్థానాలు గెలుచుకునేందుకు గెలుపు గుర్రాలను బరిలోకి దించుతోంది. దీనికోసం ప్రతిపక్ష పార్టీ అయినా గులాబీ పార్టీ నుంచి కీలక నేతలను లాగేస్తోంది కాంగ్రెస్.Congress

16 BRS MLAs into Congress party

ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పటికే… ఇద్దరూ పార్లమెంటు సభ్యులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్, అలాగే చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి తాజాగారు కాంగ్రెస్ పార్టీ లో చేరిపోయారు. అయితే ఎంపీల వరకు చేరికలు ఇప్పటివరకు కొనసాగాయి. కానీ తాజాగా గులాబీ పార్టీ ఎమ్మెల్యేల చేరికలు కూడా మొదలయ్యాయి. చేరికలకు గేట్లు ఎత్తినట్లు రేవంత్ రెడ్డి ప్రకటించిన క్షణంలోనే ఖైరతాబాద్ గులాబీ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.Congress

Also Read: IPL 2024: ఎన్నికల నోటిఫికేషన్‌…ఐపీఎల్‌ 2024 రద్దు ?

మొదటినుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న దానం నాగేందర్… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గులాబీ పార్టీలో చేరారు. ఇక ఇప్పుడు గులాబీ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి దూకేశారు. దీంతో గులాబీ పార్టీ నేతల్లో గుబులు నెలకొంది. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఎంతమంది ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు బయటకు వెళ్తారు అని టెన్షన్ అందరిలోనూ నెలకొంది. అయితే తాజా సమాచారం ప్రకారం మరో నలుగురు గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. Congress

రేవంత్ రెడ్డిని మొదట్లో కలిసిన దానం నాగేందర్ తాజాగా కాంగ్రెస్లో చేరారు. అంతకుముందు కాలేరు యాదయ్య, కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ప్రకాష్ రెడ్డి లాంటి నేతలు ఇటీవల రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ నేపథ్యంలోనే ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని వార్తలు వస్తున్నాయి. అలా మొత్తం 16 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఈ చేరికలకు కెసిఆర్ ఎలాంటి బ్రేకులు వేస్తారో చూడాలి. Congress

Join WhatsApp