ABP Cvoter Opinion Poll on AP

ABP Cvoter Opinion Poll: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల తో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఏ రాష్ట్రంలో లేని పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. మరో మూడు రోజుల్లోనే ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. వెంటనే ఎన్నికల కోడ్ కూడా అమలులోకి వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో అన్ని పార్టీలు విజయం కోసం పోటాపోటీ పడుతున్నాయి. ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా అధికార వైసీపీ పార్టీ దూసుకుపోతోంది. ABP Cvoter Opinion Poll

ABP Cvoter Opinion Survey Poll on AP

అటు ఎలాగైనా అధికార వైసిపి పార్టీని ఈసారి ఓడించాలని మూడు పార్టీలు ఏకమయ్యాయి. తాజాగా ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం మరియు జనసేన పార్టీలో కలిసిపోయాయి. ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం మరియు జనసేన పార్టీలు కలవడంతో వైసిపికి కాస్త డిసడ్వాంటేజ్ ఉంటుంది. కేంద్ర బలం ప్రతిపక్ష పార్టీలు అయిన తెలుగుదేశం మరియు జనసేన పార్టీలకు ఉంటాయి. ఏ క్షణమైనా ఎలాంటి సంచలనాన్ని సృష్టించగల పార్టీ బిజెపి. ABP Cvoter Opinion Poll

Also Read: Yanamala: టీడీపీకి బిగ్‌ షాక్‌.. వైసీపీలోకి యనమల ?

అలాంటి పార్టీతో తెలుగుదేశం మరియు జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. కాబట్టి ఏపీలో ఈసారి వైసిపి పార్టీ ఓడిపోతుందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఏబిపి సి ఓటర్ తమ ఒపీనియన్ poll రిలీజ్ చేసింది. దీని ప్రకారం ఏపీలో ఎన్డీఏ కూటమి అయినా జనసేన, తెలుగుదేశం మరియు బిజెపి పార్టీలకు ఏకంగా 20 ఎంపీ స్థానాలు వస్తాయని తేలిపోయింది. అటు అధికార వైసీపీ పార్టీ కేవలం 5 ఎంపీలను గెలుస్తుందట. ABP Cvoter Opinion Poll

అంటే ఎన్డీఏ కూటమికి 45% ఓటింగ్ రానుందట. అటు 41% వైసిపి పార్టీకి ఓటింగ్ వస్తుందని ఈ సర్వే వెల్లలించింది. అయితే… పార్లమెంట్ ఓట్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఏపీలో అసెంబ్లీ ఫలితాలు కూడా అదే విధంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. భారీగా సీట్ల తేడా లేకున్నా అధికార వైసిపి పార్టీ ఓడిపోయే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ తాజా సర్వే ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ABP Cvoter Opinion Poll

Join WhatsApp