Acb Raids On Seethakka Dosth Taslima Mohammed

Taslima Mohammed: ప్రభుత్వ ఉద్యోగం అంటేనే ఎంతో గొప్పది. అలాంటిది ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. సామాన్య ప్రజలు ప్రభుత్వ ఉద్యోగం కొట్టడం అంత సులువేం కాదు. ఎన్నో రాత్రులు కష్టపడితే తప్పితే ఉద్యోగం రాదు. ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే మన లైఫ్ సెటిల్ అయినట్లే. అయితే కొంతమంది ఉద్యోగం వచ్చాక నిజాయితీగా పని చేస్తారు. మరి కొంతమంది మాత్రం అవినీతి బాటపడతారు.Taslima Mohammed

Acb Raids On Seethakka Dosth Taslima Mohammed

అది వారి అలవాట్ల నేపథ్యంలోనే వస్తుంది. సామాన్య జీవనం నుంచి పైకి వచ్చిన వారు మాత్రం నిజాయితీగా పనిచేస్తారని నమ్మకం అందరిలోనూ ఉంటుంది. అయితే తాజాగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు మరో తిమింగలం పడిపోయింది. అయితే ఈసారి లేడీ తిమింగలం కావడం గమనార్హం. మహబూబాబాద్ సబ్ రిజిస్టార్ అధికారి తస్లీమా మహమ్మద్ లంచం తీసుకుంటూ అడ్డంగా ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. ఒక వ్యక్తి నుంచి ఏకంగా 20 వేల రూపాయల లంచం తీసుకుంటూ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆమె గతంలో ములుగు సబ్ రిజిస్టార్ గా పనిచేసిన సంగతి తెలిసిందే.Taslima Mohammed

Also Read: Ponguleti Srinivas: తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా మంత్రి పొంగులేటి..మరో ఏక్‌ నాథ్‌ షిండే ?

తస్లిమా సర్వార్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా తస్లీమాకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఎవరి ఫోను ఓపెన్ చేసిన తస్లీమా వీడియోలు కచ్చితంగా కనిపిస్తాయి. అయితే తెలంగాణలోని సబ్ రిజిస్టార్ తస్లీమా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కడం ఇప్పుడు చర్చ నీ అంశంగా మారిపోయింది. Taslima Mohammed

ప్రభుత్వ అధికారిని అయినా… కూలి పనులు చేస్తూ పేదల మధ్య తిరుగుతూ నిడారం బరంగా ఉన్నట్లు వీడియోలు చేస్తూ ఆమె పాపులరయ్యారు. లంచం అనే మాట వింటే భద్రకాళిలా వారిపైకి రెచ్చిపోతోందట తస్లీమా. అంతేకాదు ఉత్తమ అధికారిగా 13 సార్లు జాతీయ అవార్డు కూడా గెలుచుకుందట. ఇక ఈ సీన్ కట్ చేస్తే తాజాగా 20000 వేల రూపాయల లంచం తీసుకుంటూ దొరికిపోయింది తస్లీమా. దీంతో తస్లీమా గురించి సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు నేటిజన్స్. Taslima Mohammed

Join WhatsApp