AP Elections are very costly

AP Elections: రాజకీయాల్లో ఒకప్పుడు మనిషిని, మనిషి గొప్పదనాన్ని,ఆయన చేసే మంచి పనులను చూసి ఓట్లు వేసేవారు.కానీ ఇప్పుడు సమాజం అలా లేదు. ఓటుకు నోటు అన్నట్లు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికి ఓట్లు గుద్దుతున్నారు. అయితే డబ్బు తీసుకొని ఓట్లు వేయడం వల్ల మనకు సమస్యలు వచ్చిన సమయంలో మాట్లాడడానికి కూడా ఎలాంటి వీలు లేకుండా పోతుంది. ఎందుకంటే మనం డబ్బులు తీసుకొని ఓట్లు వేయడం వల్ల మాట్లాడే హక్కును కూడా కోల్పోతున్నాం. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి పార్టీ అలాగే టిడిపి జనసేన బిజెపి కూటమి పోటాపోటీగా ప్రచారాలు చేస్తోంది.

AP Elections are very costly

ఇక రెండింటి మధ్యలో కాంగ్రెస్ కూడా కాచుకుకూర్చుంది. కాంగ్రెస్ కూడా ఎన్నో కొన్ని సీట్లు గెలవాలని చూస్తోంది. ఇక ప్రధాన పోటీ మాత్రం టిడిపి కూటమి అలాగే వైసిపి మధ్యనే ఉంది. అయితే ఈసారి ఆంధ్ర ఎన్నికలు చాలా కాస్ట్లీ గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.ఎందుకంటే ఇప్పటికే మే 13న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ఉండబోతున్నట్టు ఎన్నికల కమిషన్ తెలియజేసింది.ఇక ఈ లెక్కన నెలరోజుల కంటే ఎక్కువ సమయం ఉంది.అయితే ఎలక్షన్ టైం లో ప్రజలను మభ్య పెట్టడం కోసం డబ్బులు ఖర్చు పెట్టడం కేడర్ కి, అభ్యర్థులకు తలకు మించిన భారంగా మారబోతుందట. (AP Elections)

Also Read: Pawan Kalyan: పవన్‌ కళ్యాణ్‌ కు బిగ్‌ షాక్‌..పిఠాపురం బరిలో టీడీపీ అభ్యర్థి ?

ఎందుకంటే ఎన్నికల్లో నిలబడబోయే అభ్యర్థులకు ఒక రోజుకు లక్ష నుండి 5 లక్షల వరకు ఖర్చయ్యే ఛాన్సులు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉంది. అలాగే ఎలక్షన్ కోడ్ కూడా డబ్బులు తక్కువ ఖర్చు పెట్టాలి అని చెప్పింది.అయినప్పటికీ బరిలో నిలిచిన అభ్యర్థులు ఊరుకుంటారా..పోటాపోటీగా ఖర్చులు పెడుతూ ఉంటారు.ఒక అభ్యర్థి ఓటుకు వెయ్యి రూపాయలు ఇస్తే మరో అభ్యర్థి పోటీగా ఓటుకి 2000 ఇస్తారు. అయితే ఎన్నికలు ముగిసే వరకు ఒక అభ్యర్థికి రోజుకు 5 లక్షలకు పైగా ఖర్చు ఉండడంతో కేడర్ కి వీటన్నింటినీ ఎలా మేనేజ్ చేయాలో అర్థం అవడం లేదట.

AP Elections are very costly

అంతే కాదు గెలవాలంటే ఖచ్చితంగా డబ్బులు కుమ్మరించాల్సిందే..ఇక ఎన్నికలు పూర్తయ్యేసరికి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఎమ్మెల్యేగా నిలబడే వ్యక్తికి దాదాపు 30 నుండి 50 కోట్ల వరకు ఖర్చు వస్తుందని అంచనాలు వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ప్రస్తుతం వైసిపి, టిడిపి కూటమి పోటాపోటీగా ఉండడంతో ఏ పార్టీ గెలుస్తుందో అంచనాలు వేయలేకపోతున్నారు. దాంతో డబ్బులు బాగానే ఖర్చు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఈసారి ఏపీలో కాస్ట్లీ ఎన్నికలు జరగబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.(AP Elections)

Join WhatsApp