AP Politics: Chiranjeevi in ​​support of Jagan Mohan Reddy

AP Politics: ఏపీ రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి.ఇప్పటికే పొత్తును అలాగే కొనసాగిస్తాం అనుకున్న టిడిపి,జనసేన మధ్య కొత్త చిచ్చులు పుడుతున్నాయి. దానికి ఉదాహరణగా టిడిపి, జనసేన పొత్తు పెట్టుకోవడంతో ఏ నిర్ణయమైనా ఇద్దరు కలిసే తీసుకోవాలి.కానీ టిడిపి ఈ విషయాన్ని పక్కన పెట్టి ఓ రెండు స్థానాలను ముందుగానే ప్రకటించింది. దాంతో నేనేం తక్కువ కాదు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ కూడా రెండు స్థానాలను ప్రకటించి పొత్తు ఉన్నప్పుడు ఏదైనా నిర్ణయాన్ని ఇద్దరు అనుకొని తీసుకోవాలి.కానీ టిడిపి ఎలా ప్రకటించడంతో నేను కూడా రెండు స్థానాల్లో ప్రకటిస్తున్నాను.దానికి కారణం నా పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా నన్ను ఒత్తిడి పెడుతున్నారు. మీరు అర్థం చేసుకుంటారని నేను కూడా భావిస్తున్నాను అని చెప్పారు.

AP Politics: Chiranjeevi in ​​support of Jagan Mohan Reddy

దీంతో వీరి పొత్తు ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియడం కూడా కష్టంగా మారిపోయింది. ఇక కొంతమంది అయితే ఇద్దరి మధ్య పొత్తు ఎక్కువ కాలం కొనసాగడం కష్టమే అని,ఎన్నికల వరకైనా సరే వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలు బయటపడవచ్చు అని భావిస్తున్నారు. ఇక ఈ పొత్తుల విషయం ఇలా కొనసాగుతున్న సమయంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సొంత అన్న చిరంజీవి నుండి షాక్ తగిలింది అంటూ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.దానికి ప్రధాన కారణం తాజాగా చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు రావడమే. అయితే చిరంజీవి కి అవార్డు వస్తే పవన్ కళ్యాణ్ కి ఏంటి ఇబ్బంది అని మీరందరూ భావించవచ్చు. ఇక అసలు విషయం ఏమిటంటే..చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు రావడానికి కారణం జగన్ మోహన్ రెడ్డి అని,వైయస్ జగన్ కేంద్రానికి చిరంజీవి గురించి రికమెండ్ చేయడం వల్లే ఆయనకు పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది అని కొంతమంది వైసిపి అభిమానులు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు. (AP Politics)

Also Read: AP Elections: ఏపీ ఎన్నికలపై సర్వే రిపోర్టు…ఆ పార్టీదే అఖండ విజయం!

అంతేకాదు తమ్ముడు పార్టీ పెట్టిన కూడా చిరంజీవి మద్దతు మాత్రం ఎక్కువగా జగన్మోహన్ రెడ్డికే ఉంటుందని పరోక్షంగా ఇప్పుడు అదే చేస్తారని కూడా మాట్లాడుకుంటున్నారు.అయితే రీసెంట్ గా మరో విషయం బయటపడింది. అదేంటంటే చిరంజీవికి పది సంవత్సరాల క్రితమే పద్మ విభూషణ్ అవార్డు రావాల్సిందట. కానీ కొన్ని కుట్ర రాజకీయాల కారణంగా అవార్డు ఆయనకు ఇవ్వలేదని తెలుస్తోంది.ఇక ఈసారి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే ఆయనకు పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందని ఇందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉంది అని చిరంజీవి భావిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు ఈ విషయం తెగ వైరల్ చేస్తున్నారు.

AP Politics : Chiranjeevi in ​​support of Jagan Mohan Reddy

అంతేకాదు జగన్మోహన్ రెడ్డికే చిరంజీవి పూర్తి మద్దతు ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ విషయం ప్రస్తుతం మీడియాలో వైరల్ అవ్వడంతో జనసేన కార్యకర్తలు అయోమయంలో పడిపోయారట. అంతేకాదు అవార్డు రావడం ఏమో కానీ రాజకీయాల్లో కొత్త చర్చలు మొదలయ్యాయి అని అనుకుంటున్నారట. ఇక నిజంగానే పద్మ విభూషణ్ చిరంజీవికి రావడంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంటే గనుక కచ్చితంగా మెగా అభిమానుల చూపు వైసీపీ వైపే ఉంటుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్ వైసీపీకి ఓట్లు వేసే అవకాశం ఉందని,ఇదే జరిగితే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి అంటూ నెట్టింట్లో కొన్ని వార్తల చక్కెర్లు కొడుతున్నాయి. మరి ఈ విషయం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. (AP Politics)

Join WhatsApp