CM Jagan To Release MLA and MP Candidates Fifth List Soon

Balayya: సంఘటిత శక్తిని ఎదుర్కొనే శక్తి జగన్ కి లేదని సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. కొత్తకోటలో ఏర్పాటు చేసిన సభలో ఎన్నిక ప్రచారంలో భాగంగా బాలకృష్ణ మాట్లాడారు గతంలో యువత జీవనోపాధికి కల్పించింది చంద్రబాబు అని గుర్తు చేశారు. మూడు పార్టీల కలయిక ఒక అగ్ని విస్పోటం అని అన్నారు. ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. కూటమిని ఎదుర్కొనే శక్తి జగన్ కు లేదని ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేసి హింసించడం దారుణం అని అన్నారు.

Balayya comments on Jagan

రాక్షసుడు పరిపాలన అంతం చేయడం కోసమే అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది. విశాఖ ఉక్కు మన హక్కు. రైల్వే జోన్ కేంద్రం నుండి నిధులు మంజూరు కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని అన్నారు. తల్లిని, చెల్లిని ఇంటి నుండి పంపేసి చిన్నాలని చంపినోళ్లని రక్షిస్తున్నందుకు సిద్ధమా దళితుల్ని చంపిన నిందితుల్ని కాపాడుతున్నందుకు సిద్ధమా అని అన్నారు. పోలవరం బిల్లులు ఇవ్వడానికి సిద్ధమా అన్నిటితో పాటు చివరగా చెత్త పనిమీద పన్ను వేసిన దానికి సిద్ధమా చీప్ లిక్కర్ అమ్మకం చేస్తూ లక్షల మంది మహిళలు తాళిబొట్లు తెంపినందుకు సిద్ధమా అని బాలయ్య అన్నారు.

Also read: Chiranjeevi: చిరంజీవిని అవమానించి పుట్టింటికి వెళ్ళిపోతానని బెదిరించిన సురేఖ.. కారణం..?

ఇక జగన్ ఆటలు ఆగవని గుర్తుంచుకోవాలని బాలకృష్ణ హెచ్చరించారు. ఎన్నికల యుద్ధం మొదలైంది ప్రజా తీర్పు కోసం కాస్కో అని అన్నారు. ప్రజల్ని వేధించిన పాపానికి భవిష్యత్తులో ఏ ఇబ్బంది పడతావో చూసుకో జగన్ అని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలంతా ఓటు పోటు ఎలా పొడుస్తారు తెలుసుకో అని సవాల్ విసిరారు అభివృద్ధి కావాలా విధ్వంసం కావాలా సమర్థమైన పాలన కావాలా లేదంటే రాక్షస పాలన కావాలా అని ప్రజల తెలుసుకొని ఓటు వేయాలని అన్నారు బాలయ్య (Balayya).

CM Jagan To Release MLA and MP Candidates Fifth List Soon
Join WhatsApp