Bandi Sanjay: ఎలక్షన్లు దగ్గర పడడం తో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అయితే కేటీఆర్ చేసిన కామెంట్స్ మీద బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ని చూస్తే… ఆదివారం నాడు కరీంనగర్ లో ఆయన మీడియా తో మాట్లాడారు తెలంగాణకి పట్టిన దరిద్రం కేసీఆర్ కుటుంబం అని ఆయన అన్నారు. ప్రజల కి పట్టిన దరిద్రం వదిలించడానికి బిజెపి పోరాటం చేస్తోంది. కారు పోయిందని, సర్వీసింగ్ కాదని షెడ్డు కి కారు పోయిందని, స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు.

Bandi Sanjay counter on Kcr

అధికారం పోయినా కూడా కేటీఆర్ కి అహంకారం తగ్గలేదని బండి సంజయ్ విమర్శించారు. మీ అరాచకాలు, అహంకారం మీద పోరాడి తరిమికొట్టింది బిజెపి అని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కారు రిపేర్ కి కూడా పనికి రాకుండా పోయిందని అన్నారు. పాత సామాన్లు కూడా ఆ డొక్కు కారు ని అస్సలు కొనే పరిస్థితి లేదంటూ సెటైర్లు వేశారు బండి సంజయ్.

Also read: Motorola Razr 40 Ultra: ఈ మొబైల్ పై రూ:20వేల తగ్గింపు..అద్భుత ఫీచర్లు..!

అంతే కాకుండా కేటీఆర్ కి దమ్ముంటే బిఆర్ఎస్ పాలన లో ఏ గ్రామానికి ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని కూడా బండి సంజయ్ అన్నారు రాబోయే ఎన్నికల్లో మోడీ చేసిన అభివృద్ధి ఏ గ్రామానికి ఎన్ని నిధులు ఇచ్చారని వివరాలని పూర్తిగా ప్రజలకు చెప్తామని అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్స్ మూడవ స్థానం అని రాసి పెట్టుకోమని చెప్పారు బండి సంజయ్. ప్రస్తుతం బండి సంజయ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి (Bandi Sanjay).

Join WhatsApp