will he be the Prime Minister in BJP

Bandi Sanjay : బండి సంజయ్ సమక్షంలో హుస్నాబాద్ కి చెందిన పలువురు బిజెపి లో చేరారు. అయితే ఈ మాజీ సర్పంచులు బిజెపి లో చేరిన నేపథ్యం లో బండి సంజయ్ మాట్లాడటం జరిగింది. ఇక వివరాల్లోకి వెళితే… బండి సంజయ్ మాట్లాడుతూ ఎకరాకి 14 వేల బోనస్ ఎందుకు ఇవ్వట్లేదని అన్నారు. తాలు తరుగు తేమతో పని లేకుండా వడ్లు ఎందుకు కొనట్లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని బండి సంజయ్ అడిగారు. ఎన్నికల తర్వాత రుణమాఫీ చేస్తామంటే నమ్మేది ఎవరిని ఆయన అన్నారు. ప్రజా సమస్యల్ని దారి మళ్లించడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నారని విమర్శలు చేశారు బండి సంజయ్.

Bandi Sanjay said modi win this time

అదేవిధంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఇండియన్ పొలిటికల్ లీడ్ లో కప్ మోడీది అని చెప్పారు. తెలంగాణలోనూ ఐపీల్ కప్ బిజెపిదే అని అన్నారు. కరీంనగర్ లో భారీ మెజారిటీతో గెలవబోతున్నామని ధీమా ని వ్యక్తం చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలారా మీ జెండా ఎజెండాలని పక్కన పెట్టాలని చెప్పారు దేశ రక్షణ కోసం పాటుపడుతున్న మోడీకి మద్దతు ఇవ్వాలని అన్నారు. కోర్టుల మీద అబండాలు వేయడం నీచమని పొన్నం వ్యాఖ్యలు ముమ్మాటికీ కోర్టు ధిక్కరిని అని చెప్పారు బండి సంజయ్. న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బాధ్యతాయుత పదవుల్లో ఉంటూ ఇష్టానుసారంగా మాట్లాడితే ఎలా అని అన్నారు.

Also read: Amala: అమల చూస్తుండగానే పాడు పని చేసిన నాగార్జున.. కోపంతో ఆమె ఏం చేసిందంటే..?

హుస్నాబాద్ లో పిచ్చాసుపత్రిని ఏర్పాటు చేయించాలని పొన్నం మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. అలానే కాంగ్రెస్ నాయకులు కూడా భయపడే పరిస్థితి వచ్చిందని బండి సంజయ్ అన్నారు. బండి సంజయ్ సమక్షంలో హుస్నాబాద్ కి చెందిన మాజీ సర్పంచ్లు బిజెపిలో చేరిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ బిఆర్ఎస్ ప్రజల సమస్యలు దారి మళ్ళించడానికి డ్రామాలు ఆడుతున్నాయని చెప్పారు భారీ మెజారిటీతో కరీంనగర్లో గెలవబోతున్నామని అన్నారు (Bandi Sanjay).

will he be the Prime Minister in BJP
Join WhatsApp