Big shock for Pawan Kalyan TDP candidate in Pithapuram constituency

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఏపీ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో మే 13వ తేదీన పోలింగ్ ఉంటుంది. జూన్ 4వ తేదీన కౌంటింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. దీంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.Pawan Kalyan

Big shock for Pawan Kalyan TDP candidate in Pithapuram constituency

ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు టిడిపి, జనసేన మరియు బిజెపి పార్టీలో ఏకమయ్యాయి. ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కంకణం కట్టుకున్నాయి ఈ మూడు పార్టీలు. అయితే సింహం సింగిల్ గా వస్తుందన్నట్లుగానే జగన్మోహన్ రెడ్డి ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఊహించని షాక్ లు తగులుతున్నాయి. ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నాడు. Pawan Kalyan

Also Read: Pawan kalyan: పిఠాపురంలో ఓటుకు పదివేలు…ఫ్యామిలీకి లక్ష….!?

దీనికోసం పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. అయితే… పిఠాపురం నియోజకవర్గంలో టిడిపి ఇన్చార్జి వర్మ కూడా పోటీ చేయాలని అనుకుంటున్నాడు. కానీ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేయనున్నారు. అయితే మొన్న జరిగిన జనసేన మీటింగ్ లో… బిజెపి కోరితే కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. దీంతో సందు దొరికించుకున్న వర్మ… పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీ గా పోటీ చేస్తే… తాను పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని వెల్లడించాడు. Pawan Kalyan

దీంతో పిఠాపురం నియోజకవర్గ రాజకీయాలు హిట్ ఎక్కాయి. పవన్ కళ్యాణ్ ప్రకటనల నేపథ్యంలో ఇటు జనసేన అటు తెలుగుదేశం తమ్ముళ్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ నిలకడ లేని ప్రకటనలతో… తమకు నచ్చిన నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. ఇక మరికొంతమంది కూటమిని వదిలి వైసిపి వైపు వెళుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలవడం చాలా కష్టమని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనికి కారణం వైసిపి తరఫున కాపు మహిళా నేతను బర్లోకి దింపారు జగన్. Pawan Kalyan

కాపు సామాజిక వర్గానికి చెందిన వంగ గీతాను నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి కాపు ఓట్లు పవన్ కళ్యాణ్ కు అలాగే వంగ గీతాకు కూడా పడతాయి. ఇలాంటి నేపథ్యంలో… ఏ పార్టీ గెలుస్తుందో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. కానీ రెండు పార్టీలు గెలిచేందుకు ఖర్చు విపరీతంగా పెడుతున్నాయని సమాచారం అందుతోంది. Pawan Kalyan

Join WhatsApp