Big shock for Pawan Kalyan Varma joins YCP

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో అందరూ నామినేషన్లు కూడా వేశారు. ఇక ఎన్నికల ప్రచారంపై అన్ని పార్టీలు దృష్టిపెట్టాయి. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డిని ఓడించేందుకు ఏపీలో ఉన్న మూడు ప్రధాన ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. అయినప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి భయపడకుండా ముందుకు వెళ్తున్నారు. Pawan Kalyan

Big shock for Pawan Kalyan Varma joins YCP

ప్రతిపక్ష పార్టీలను ఏకిపారేస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్మోహన్ రెడ్డి గురించి పక్కకు పెడితే.. ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం పైనే ఉంది. దీనంతటికీ కారణం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడం. ఇప్పటివరకు ఒక్కసారి కూడా గెలవలేని పవన్ కళ్యాణ్… పిఠాపురం నియోజకవర్గం నుంచి ఈసారి పోటీ చేస్తున్నారు. దీంతో అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గ పైన పడింది. Pawan Kalyan

Also Read: Pawan Kalyan: జనసేనకు బిగ్‌ షాక్‌..పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ పేరుతో ముగ్గురు ?

టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. ఎలాగైనా పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టాలని చాలామంది ఆశిస్తున్నారు. అయితే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవకుండా అడుగడుగునా అడ్డుకుంటుంది వైసిపి పార్టీ. తమదైన వ్యూహాలు అమలు చేస్తూ… పవన్ కళ్యాణ్ కు చుక్కలు చూపిస్తోంది వైసిపి. Pawan Kalyan

అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మరో షాక్ తగిలినట్లు సమాచారం అందుతుంది. పిఠాపురంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ప్రస్తుత టిడిపి పార్టీ నేత వర్మ కీలక నిర్ణయం తీసుకున్నారట. టికెట్ ఆశించి.. బంగపడ్డ వర్మ వైసిపి పార్టీలు చేరేందుకు సిద్ధమయ్యారట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన మద్దతును విరమించుకొని… వైసీపీ పార్టీ విజయం కోసం పనిచేయాలని అనుకుంటున్నారట. ఒకవేళ ఇదే జరిగితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పెద్ద షాక్ తప్పదు. Pawan Kalyan

ఎందుకంటే టిడిపి నేత వర్మ క్యాడర్ లేకుండా జనసేన పార్టీకి అక్కడ విజయం అసాధ్యం. వర్మ గత పది సంవత్సరాలుగా తన క్యాడర్ను బలంగా ఏర్పరచుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో వర్మ పక్కకు జరిగితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఓట్లు పడడం కష్టమని… వంగ గీత గెలిచే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. Pawan Kalyan

Join WhatsApp