Big Shock To Chandrababu Pawan Kalyan may left Tdp

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో ఎన్నికల కోడ్ ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియని పరిస్థితి నెలకొంది. మార్చి చివర్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి.Pawan Kalyan

Big Shock To Chandrababu Pawan Kalyan may Good Bye Tdp

తెలుగుదేశం మరియు జనసేన పార్టీలో ఒక అడుగు ముందుకు వేసి 99 అభ్యర్థులను ప్రకటించాయి. ఇందులో కేవలం 5 మంది అభ్యర్థులను జనసేన పార్టీ ప్రకటించగా మిగతా అందరూ టిడిపి పార్టీ వారు కావడం గమనార్హం. అంతేకాదు జనసేన పార్టీలో ఉన్న కీలక నేతలు పవన్ కళ్యాణ్, నాగబాబు, దుర్గేష్ సీట్లు ఇంకా ఖరారు కాలేదు. కేవలం నాదెండ్ల భాస్కర్ టికెట్ మాత్రమే కన్ఫర్మ్ అయింది. దుర్గేష్ రాజమండ్రి రూరల్ టికెట్ అడుగుతున్నారు.Pawan Kalyan

Also Read: Pawan Kalyan: ఏపీ సీఎంగా పవన్‌ కళ్యాణ్‌..అన్ని మంత్రి పదవులు జనసేనాకే ?

కానీ పొత్తులో భాగంగా టిడిపి సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య కు రాజమండ్రి రూరల్ టికెట్ వెళ్లే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. కానీ దుర్గేష్ మాత్రం.. తనకు రాజమండ్రి రూరల్ టికెట్ మాత్రమే కావాలని అడుగుతున్నారు. రిమోట్ చంద్రబాబు చేతిలో ఉండటంతో… జనసేన వాటి కార్యకర్తలు అలాగే నేతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.జనసేన పార్టీ కోసం పనిచేసిన నాయకులకు ప్రస్తుతం స్వేచ్ఛ లేకుండా అయిపోయిందని కొంతమంది వాపోతున్నారు.Pawan Kalyan

ఇక మరికొంతమంది జనసేన పార్టీకి కేవలం 24 అసెంబ్లీ సీట్లు ఇవ్వడం అత్యంత దారుణమని రాజకీయ విశ్లేషకులతో పాటు హరి రామ జోగయ్య లాంటి వారు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా రెండు సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలని కూడా కొత్త డిమాండ్ తెరపైకి వస్తోంది. ఈసారి ముఖ్యమంత్రి కాకపోతే పవన్ కళ్యాణ్ రాజకీయం ప్రమాదంలో పడే ఛాన్స్ ఉన్నట్లు కూడా చెబుతున్నారు. అయితే ఇలాంటి చిన్న చిన్న గొడవలు ఎన్నికల వరకు పెద్దగా అయ్యే ఛాన్స్ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.Pawan Kalyan

ఇదే జరిగితే జనసేన మరియు టిడిపి పార్టీలు విడిపోతాయని కూడా అంటున్నారు. ఇదే విషయాన్ని jd లక్ష్మీనారాయణ కూడా స్పష్టం చేశారు. టిడిపి పొత్తు నుంచి పవన్ కళ్యాణ్ బయటకు రావచ్చు అని తాజాగా లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఆ పార్టీలో ఉన్న గొడవలు అలాగే జనసేనకు జరిగిన అన్యాయం కారణంగా.. పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి బిజెపితో కలిసి పోటీ చేసే అవకాశం కూడా ఉందని లక్ష్మీనారాయణ తెలిపారు. రాజకీయాలలో ఏదైనా జరగవచ్చని… పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఇదే జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు.Pawan Kalyan

Join WhatsApp