BJP is serious about Purandareswari

Purandareswari: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందరేశ్వరి కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే దగ్గుబాటి పురేంధరేశ్వరి ఉన్నది బీజేపీలోనే అయినప్పటికీ తన ద్యాస పూర్తిగా టిడిపి పైనే ఉంటుందని ఇప్పటికే సొంత పార్టీ నేతలతో పాటు వేరే పార్టీ నేతలు కూడా ఈమెపై విమర్శలు గుప్పించారు. ఎందుకంటే బిజెపి అధ్యక్షురాలుగా పురంధరేశ్వరి బాధ్యతలు కొనసాగిస్తున్నప్పటికీ ఆమె పూర్తిగా టిడిపికి సపోర్టుగానే మాట్లాడుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన సమయంలో కూడా వైఎస్ఆర్సిపి పార్టీపై విమర్శలు గుప్పిస్తూ టిడిపికి సపోర్టుగా మాట్లాడింది.

BJP is serious about Purandareswari

ఆ సమయంలో బిజెపి అధిష్టానం నుండి కూడా ఈమెకు ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి అయినప్పటికీ వెనక్కి తగ్గలేదు. అయితే ఆంధ్రప్రదేశ్లో టిడిపి జనసేన కూటమిలో బిజెపి కూడా కలవబోతుందని ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపించాయి. అయితే టిడిపి తో పొత్తు పెట్టుకోవడానికి బిజెపి పార్టీ ఆసక్తి చూపించక పోయినప్పటికీ పురందరేశ్వరి తరచూ టిడిపి జనసేన కూటమితో కలుద్దామని ఢిల్లీ పెద్దలకుసమాచారం పంపుతుందట. అయితే తాజాగా పురందరేశ్వరి గురించి ఓ వార్త మీడియాలో వైరల్ గా మారింది.(Purandareswari)

Also Read: Ys Sharmila: మంగళగిరి బరిలో షర్మిల.. పాపం మళ్ళీ లోకేష్ కు ఓటమి తప్పదా?

అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో చాలామంది వైయస్ఆర్సీపీ పార్టీ వీడి కాంగ్రెస్,టిడిపి,జనసేనలోకి చేరుతున్నారు. ఎక్కువ చేరికలు టిడిపిలోకే ఉన్నాయి. అయితే అంతమంది వైఎస్సార్సీపీ పార్టీని వీడినప్పటికీ ఒక్కరు కూడా బిజెపిలోకి ఎందుకు చేరడం లేదు అని ఢిల్లీ అధిష్టానానికి కాస్త అనుమానం వచ్చిందట. అయితే వైయస్ఆర్సీపీ పార్టీని వీడిన వాళ్ళు బిజెపిలోకి వెళ్లడానికి ఆసక్తి చూపిస్తే స్వయంగా పురందరేశ్వరి కల్పించుకొని బిజెపిలో ఎలాంటి ఫ్యూచర్ ఉండదు.

BJP is serious about Purandareswari

ఎన్ని సంవత్సరాలైనా ఆంధ్రా లో బిజెపి అధికారంలోకి రాదు. మీరు టిడిపిలో చేరడమే మంచిది.కావాలంటే చంద్రబాబు నాయుడుతో నేను మాట్లాడతాను అంటూ వారికి ఉచిత సలహాలు ఇస్తుందట. అయితే ఈ విషయం కొంతమంది ఢిల్లీ అధిష్టానానికి చెప్పడంతో పురంధరేశ్వరిపై అమిత్ షా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. అంతేకాదు సొంత పార్టీని బలోపేతం చేయకుండా ఇతర పార్టీలకు మేలు చేకూర్చడం ఏంటని.. నీకు అంతగా మీ తండ్రి పెట్టిన పార్టీపై గౌరవం ఉంటే నువ్వు కూడా బిజెపిని వీడి టిడిపిలో చేరమంటూ సీరియస్ అయినట్టు తెలుస్తోంది.(Purandareswari)

Join WhatsApp