MLC Kavitha was arrest in delhi liquer scam

Kavitha: ఎమ్మెల్సీ కవిత అరెస్టు మీద బిజెపి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక కామెంట్స్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు లో కవిత అవినీతి కి పాల్పడినందుకు జైలుకు వెళ్లాల్సిందేనని అన్నారు. తప్పు చేస్తే ఎవరైనా జైలుకు వెళ్లాలని అన్నారు. ఈరోజు సోదరి వెళ్ళింది రేపు సోదరుడు వెళ్ళవచ్చు. ఎల్లుండి తండ్రి కూడా వెళ్లవచ్చు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రాజాసింగ్ వ్యాఖ్యలని ఆయన ఒక వీడియో ద్వారా తెలిపారు. అయితే కవిత ఎప్పటికైనా అరెస్టు అవ్వాల్సిందేనని ఎందుకంటే ఇది మోడీ పాలనాని మోడీ పాలనలో అవినీతిపరులని వదిలేది లేదని అన్నారు.

BJP leaders on kavitha arrest

ఇంతకుముందు సీఎం మనీష్ సిసోడియా ని అరెస్ట్ చేసారని తర్వాత కవితకి ఈడీ పలుమార్లు నోటీసులు ఇచ్చిందని అన్నారు. ఆమె విచారణకు వెళ్లలేదని సుప్రీంకోర్టుకి వెళ్లిందని అన్నారు అయితే కవిత ఈరోజు కాకపోతే రేపైనా సరే అరెస్ట్ ఇవ్వాల్సిందేనని అన్నారు. ఈరోజు అరెస్ట్ అయ్యారని రాజాసింగ్ అన్నారు. అన్యాయంగా తనమీద పిడి ఆక్ట్ పెట్టి 77 రోజులు జైల్లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ రాజ్యంలో తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదు అని అన్నారు.

Also read: Realme Gt Neo 6 SE: రియల్ మీ నుంచి సరికొత్త మొబైల్..ఫీచర్స్ అమోఘం.!

అలానే ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ స్పందించారు కవిత అరెస్ట్ కి బిజెపికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు ఎన్నికల్లో ప్రజలు చెప్పిన కేటీఆర్ హరీష్ రావు ఇంకా మారలేదని అన్నారు. బిజెపి పై అనవసర ఆరోపణలు ఇకనైనా మానుకోవాలని చెప్పారు. కవిత ని లిక్కర్ స్కాంలో అరెస్ట్ చేస్తే బీజేపీ కి ఏం సంబంధం అని అన్నారు తమది రాజకీయ పార్టీ ప్రభుత్వాలనే ఏర్పాటు చేయడం దేశాన్ని ముందుకు నడిపించడం తమ పని అని చెప్పారు కేటీఆర్ బుద్ధిమంతుడు అయితే చెల్లెల్ని లిక్కర్ స్కామ్ చేయకుండా ఆపే వాడని అన్నారు. ఇలా ఎమ్మెల్సీ కవిత అరెస్టు గురించి బిజెపి నేతలు ఈ విధంగా రియాక్ట్ అయ్యారు ప్రస్తుతం ఇవి చర్చనీయాంసంగా మారాయి (Kavitha).

MLC Kavitha was arrest in delhi liquer scam
Join WhatsApp