Bjp Party Big Shock to Raghurama Krishnaraju

Raghurama Krishnaraju: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మే 13వ తేదీన ఏపీలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికీ అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి. Raghurama Krishnaraju

Bjp Party Big Shock to Raghurama Krishnaraju

ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు ఏపీలో ఉన్న తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీలు ఒకటై ముందుకు వెళ్తున్నాయి. కూటమిగా ఏర్పడిన ఈ మూడు పార్టీలు ఇప్పటికే దాదాపు సీట్లు అన్నిటిని ప్రకటించాయి. అడప దడప సమస్యలు తప్ప… ఏపీవ్యాప్తంగా అన్ని సీట్లను ప్రకటించాయి ఈ కూటమి పార్టీలు. అయితే లేటెస్ట్ గా పొత్తులో భాగంగా బిజెపి పార్టీ తమ ఏపీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించేసింది. వాస్తవానికి ఏపీలో 6 ఎంపీ స్థానాలలో బిజెపి పార్టీ పోటీ చేయాలి. పది అసెంబ్లీ స్థానాలలో కమలనాథులు బరిలో ఉంటారు.Raghurama Krishnaraju

Also Read: Congress: కాంగ్రెస్ లో అంతర్యుద్ధం.. తుమ్మలకు సిగ్గు, శరం లేదట.. కోమటిరెడ్డి సంచలనం ?

దానికి తగ్గట్టుగానే తాజాగా ఆరు ఎంపి స్థానాల అభ్యర్థులను ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది.అయితే ఇక్కడే ఓ పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చిన రఘురామకృష్ణరాజు కు బిజెపి పార్టీ ఎంపీ టికెట్ ఇస్తుందని అందరూ అనుకున్నారు. ఎప్పటిలాగే నరసాపురం అభ్యర్థిగా ఆయన బరిలో ఉంటారని చెప్పారు. కానీ చివరికి రఘురామకృష్ణ రాజుకు పంగనామాలు పెట్టింది బిజెపి పార్టీ. పొత్తులో భాగంగా ఇస్తామని చెప్పి రఘురామకృష్ణ రాజుకు బిజెపి హ్యాండ్ ఇచ్చింది. Raghurama Krishnaraju

నరసాపురం పార్లమెంట్ టికెట్ ను భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కు ఇచ్చింది బిజెపి పార్టీ. దీంతో రఘురామరాజు కంగు తిన్నారు. అంతేకాదు సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు ఎంపీ టికెట్ రాకుండా బిజెపితో మ్యానేజ్ చేపించారని ఆయన ఆరోపణలు చేస్తున్నారు. మరి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా రఘురామరాజు పోటీ చేస్తారా చూడాలి.Raghurama Krishnaraju

Join WhatsApp