BJP's Big Strategy. Chiranjeevi to Rajya Sabha

Chiranjeevi: ఈ మధ్యకాలంలో బీజేపీ వ్యూహాలు అస్సలు అర్థం అవడం లేదు.ఎప్పుడు ఎవరికి దగ్గరవుతుందో తెలియడం లేదు. ఇక గత కొద్ది రోజుల నుండి మెగా ఫ్యామిలీకి దగ్గరవుతుంది.అయితే తెలంగాణలో బీజేపీ తో జనసేన పొత్తు పెట్టుకున్నాక ఆంధ్రలో కూడా పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నప్పటికీ అది ఎటూ కుదరడం లేదు. అయితే ఈ మధ్యనే 2024 లో కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను విడుదల చేసింది. దేశంలోనే రెండవ అత్యున్నత పురస్కారమైనా పద్మ విభూషణ్ చిరంజీవికి వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

BJP’s Big Strategy. Chiranjeevi to Rajya Sabha

అయితే చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం వెనుక బీజేపీ పార్టీ ఉందని ఇప్పటికే ఎన్నో వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా బీజేపీ మరొక ప్లాన్ వేస్తోందట.అదేంటంటే చిరంజీవికి రాజ్యసభ పదవి ఇవ్వాలని ఒక వ్యూహం రచిస్తున్నట్టు మీడియాలో ఓ టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం దేశం మొత్తం సార్వత్రిక ఎన్నికల హడావిడి నడుస్తుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో 6 రాజ్యసభ సీట్లు ఉన్నాయి. ఇందులో తెలంగాణలో రెండు కాంగ్రెస్ కి వస్తాయని, ఒకటి బీఆర్ఎస్ కు దక్కుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. (Chiranjeevi)

Also Read: Devara Part – 1: ఎన్టీఆర్ సినిమా రావడం అప్పుడు కూడా కష్టమేనా

అలాగే ఆంధ్రాలో మాత్రం మూడు సీట్లు వైసిపికే వస్తాయని తెలుస్తోంది. అయితే మన దేశంలో అత్యధికంగా రాజ్యసభ స్థానాలు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి అక్కడ పది రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. అయితే ఈసారి బీజేపీ ఓ ఒక ప్లాన్ వేస్తోంది.అదేంటంటే చిరంజీవికి ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభ నామినేటెడ్ పదవి ఇవ్వాలని చూస్తున్నట్టు సమాచారం. అయితే గతంలో కూడా చిరంజీవికి రాష్ట్రపతి కోటా నుండి రాజ్యసభ పదవి వచ్చినప్పటికీ ఆయన సున్నితంగా రిజెక్ట్ చేశారట.దాంతో ఆ పదవి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కి ఇచ్చారు.

Chiranjeevi: BJP's big strategy.. Chiranjeevi to Rajya Sabha

అయితే ప్రస్తుతం చిరంజీవికి ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభ పదవి ఇచ్చి ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు ముగిశాక ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిరంజీవికి మంత్రి పదవి ఇవ్వాలి అని బిజెపి వ్యూహం రచిస్తోందట. ఇక బీజేపీ చిరంజీవికి ఇలా దగ్గర అవడం వెనుక ఉన్న వ్యూహం ఏంటో ఎవరికి అంతు పట్టడం లేదు. చిరంజీవికి రాజ్యసభ పదవి ఇస్తారంటూ వార్తలు వస్తున్నాయి కానీ చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా లేదా అనేది చూడాలి.

Join WhatsApp