CM: మద్యం కుంభకోణం కేసు లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ అయిన జైలు నుండి తన బాధ్యతల్ని నిర్వర్తిస్తారని మంత్రి అతిషి చెప్పారు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత నేతలు సమావేశం అయ్యారు ఆ సమావేశం తర్వాత మాట్లాడుతూ జైల్లో ఉన్న సీఎంగా కేజ్రీవాల్ కొనసాగుతారు మొదటి నుండి ఆయన చెప్తోంది అదే. అయితే ఇందులో రెండు ఆలోచనలు ఉన్నాయి. జైలు నుండి సీఎం గా పని చేసే విషయం లో కేజ్రీవాల్ ని ఏ చట్టము ఆపలేదు. లిక్కర్ స్కామ్ లో ఆయన ఇంకా దోషిగా తేలలేదు అని క్లియర్ గా తెలుస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే అసలు జైల్లో ఉండి సీఎం గా కొనసాగించే చట్టం ఏం చెప్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం.

Can CM continue in post from jail

చట్టం ప్రకారం ఒక కేసులో దోషిగా తేలితేనే ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించబడతారు ప్రజా ప్రాతినిథ్యం చట్టం 1951 నిర్దిష్ట నేరాలకి నిబంధనలను కలిగి ఉంది ఆ పదవిలో ఉన్న ఎవరైనా దోషిగా నిర్దారణ అయితే అనర్హతకి గురవుతారు. ముఖ్యమంత్రిని రెండు పదవుల్లో పదవి నుండి తొలగించవచ్చు. అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయినప్పుడు ఊరు లేదంటే ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం విజయవంతమైనప్పుడు తొలగించొచ్చు అని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు.

Also read: Mobile Trick: ఈ చిన్న ట్రిక్స్ తో మీ పాత ఫోన్ కొత్తగా మారుతుంది..!

ఇక కేజ్రీవాల్ విషయానికి వస్తే ఈ లెక్కన లిక్కర్ స్కామ్ కేసులో ఇంకా దోషిగా తేలలేదు. ఇక్కడ చెప్పిన రెండు సందర్భాలు కూడా ప్రస్తుతం వర్తించవు. కనుక జైల్లో ఉన్నప్పటికీ కేజ్రీవాల్ పదవికి చట్టపరమైన ఇబ్బందులు లేవు అని విశ్లేషకులు చెప్తున్నారు. స్వతంత్ర భారతదేశంలో పదవిలో ఉండగా అరెస్టు అయిన మొదటి సీఎం గా కేజ్రీవాల్ నిలిచారు. ఈ ఏడాది ప్రారంభంలో భూకుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యే ముందు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సూరి పదవికి రాజీనామా చేశారు బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ 1997లో దాల కుంభకోణంలో దోషిగా తేలడం తో అరెస్ట్ కాకముందే సీఎం పదవి నుండి తప్పుకున్నారు. కేజ్రీవాల్ మాత్రం పదవిలో ఉండగానే అరెస్ట్ అయ్యారు (CM).

Join WhatsApp