Chandrababu caught in BJP's trap.. Is it all Jagan Mohan Reddy plan

Chandra Babu : వైసిపి ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్ళు వెనక్కి వెళ్లిందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కృష్ణ జిల్లా పెడనలో బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటుగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేదవ్యాస వంటి వాళ్ళకి అవకాశాన్ని కల్పించలేకపోయాము. అధికారంలోకి రాగానే వీళ్ళందర్నీ గౌరవిస్తామని అన్నారు. శ్రీరాముడు రావణాసుర వధ చేశాడు ఏపీ ప్రజలు జగనాసురవద చేయాలని పిలుపునిచ్చారు. అలానే అన్ని వర్గాలని నట్టెట్లో ముంచేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. సర్వేలన్నీ మనకి అనుకూలంగా ఉన్నాయి అని చంద్రబాబు నాయుడు అన్నారు.

Chandra babu comments on jagan ruling

బాలశౌరి కృష్ణ ప్రసాద్ గెలుపు తథ్యం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. జగన్ ఇన్నాళ్లు పరదాలు కట్టుకుని తిరిగాడు ఇప్పుడు బుగ్గలు నిమురుతున్నాడు. ముద్దులు పెడుతూ మళ్లీ బయలుదేరాడని చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. మావి మూడు జెండాలు కానీ ఏజెండా ఒక్కటే అని అన్నారు చంద్రబాబు నాయుడు. మేం ముగ్గురం కలిసి వస్తున్నాం జగన్ శవాలతో వస్తున్నాడు అని చంద్రబాబు నాయుడు విమర్శించారు. విధ్వంసం అహంకారంతో రాష్ట్రాన్ని నాశనం చేశాడు. 2019లో మేము గెలిచి ఉంటే కృష్ణ లో నీటి సమస్య ఉండేది కాదని అన్నారు.

Also read: Revanth Reddy: తెరపైకి వచ్చిన ఓటుకు నోటు కేసు.. రేవంత్ రెడ్డి జైలుకే..?

పోలవరం ని జగన్ గోదావరిలో ముంచేసాడని అన్నారు. అమరావతిని నాశనం చేశాడని అన్నారు. బందరు పోర్టు అమరావతి వస్తే పెడన ఇంకా అభివృద్ధి అవుతుందని అన్నారు టిడిపి ఇచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. జగన్ అమలు చేసేవి నవరత్నాలు కావని నకిలీ రత్నాలని సెటైర్లు వేశారు. మద్యపానం నిషేధం చేశాడా ప్రత్యేక హోదా తెచ్చాడా అని ప్రశ్నించారు. నాసిరకం మద్యం తాగిస్తూ ప్రజల రక్తాన్ని తాగుతున్నాడని అన్నారు. వైసిపి ఐదేళ్ల పాలన లో ఏపీ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని చెప్పారు పోలీసులని జగన్ తన బానిసలని అనుకుంటున్నాడు. బటన్ నొక్కడం తప్ప జగన్ కి ఏమీ తెలియదని బటన్ నొక్కడంకి జగన్ ఎందుకు ఇంట్లో ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందని చంద్రబాబు నాయుడు అన్నారు (Chandra Babu).

Chandrababu caught in BJP's trap.. Is it all Jagan Mohan Reddy plan
Join WhatsApp