Chandrababu Naidu Prepares for AP Elections in Telangana Style

Chandrababu : విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన వైసిపి పార్టీ మీద విమర్శలు కురిపించారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ శృంగారపుకోట యుద్ధానికి సై అంటుంది కాలు దువ్వుతుంది అందుకు కారణం బాధ ఆవేదన అని అన్నారు చంద్రబాబు నాయుడు. ఒకటే నినాదం వైసిపి ఓడిపోవాలని అని. చంద్రబాబు నాయుడు అన్నారు ఎన్నో తుఫాను చూసా మే 13న ఒకటే తుఫాన్ అని చెప్పారు. వైసిపి బంగాళాఖాతంలో కలిసిపోవాలని ఆయన దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వంలో ఎవరైనా రక్షణ ఉందా మహిళలకి అసలు లేదు అని చంద్రబాబు నాయుడు అన్నారు.

Chandrababu comments on Jagan

గుంటూరు కి చెందిన ఒక మహిళ వైసిపి ప్రభుత్వం మీద పోరాడిందని ఈరోజు ఢిల్లీకి వెళ్లి ఎంతో మంది ప్రముఖుల్ని కలవడానికి ప్రయత్నం చేసిందని కానీ అనుమతి లేకపోవడంతో ఆమె బొటనవేలు కట్ చేసుకుందామని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ అరాచక పాలన పోవాలని సాహసం చేసిందని చెప్పారు. కర్నూల్ లో అబ్దుల్ అనే ఒక వ్యక్తి వైసీపీ ప్రభుత్వం పెట్టే బాధల్ని తట్టుకోలేక రైలు కింద పడి చనిపోయారని ఒక అరాచక శక్తి ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నాడు అని చంద్రబాబు నాయుడు అన్నారు.

Also read: Amitabh Bachchan: కోట్లు ఖర్చుపెట్టి ముంబైలో స్థలం కొన్న అమితాబ్ బచ్చన్.. ధర ఎంతంటే..?

జగన్ ఒక అహంకారి అన్యాయం జరిగింది అంటే వాళ్ళని బాధ పెట్టడం చివరికి హత్య చేయడం చేస్తున్నారని చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలో ఒక మంచి యూనివర్సిటీ అయిన గీతం లో కూడా ఇబ్బందులు తీసుకువచ్చారని చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ ఒక సైకో అతను ఒక అహంకారి అని అన్నారు ఈ ప్రభుత్వంలో రాష్ట్రమంతా గంజాయి డ్రెస్ చీప్ లిక్కర్ మయం అయిపోయిందని అన్నారు ఒక వ్యక్తి స్వార్థం కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడని చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హుద్ హుద్ వస్తే ఇక్కడే ఉండి అన్ని పనులు దగ్గర ఉండి చూసుకున్నానని చంద్రబాబు నాయుడు అన్నారు (Chandrababu).

Chandrababu caught in BJP's trap.. Is it all Jagan Mohan Reddy plan
Join WhatsApp