Chiranjeevi campaign for Chandrababu

Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపు చాలామంది నామినేషన్ల దాఖలు ప్రక్రియ కూడా పూర్తయింది. మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలు ఒకే రోజున జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలన్నీ వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా పోరాటాలను చేస్తున్నాయి. ఎలాగైనా అధికార వైసీపీ పార్టీని ఓడించేందుకు ఏకమయ్యాయి జనసేన, టిడిపి అలాగే తెలుగుదేశం పార్టీలు. Chiranjeevi

Chiranjeevi campaign for Chandrababu

దానికి తోడు… వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరపున యుద్ధ వాతావరణన్ని సృష్టిస్తోంది. జగన్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. అటు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ నటీనటులు కూడా కూటమి సభ్యులకు ప్రచారం చేస్తున్నారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా రంగంలోకి దిగారు. కూటమికి సపోర్ట్ ఇచ్చి… పవన్ కళ్యాణ్ అన్నయ్యగా తన బాధ్యతను తీర్చుకున్నాడు. ఇన్ డైరెక్టుగా వైసిపికి ఓటు వేయకూడదని తేల్చి చెప్పాడు చిరంజీవి. Chiranjeevi

Also Read: Ys Sharmila: జగన్ నుంచి రూ.82 కోట్లు అప్పు తీసుకున్న షర్మిల ?

అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పార్టీకి ఐదు కోట్ల విరాళం కూడా ఇచ్చాడు చిరంజీవి. జనసేన పార్టీ ఖర్చులకోసం ఇస్తున్నట్లు చెప్పారు. అలాగే అనకాపల్లి ఎంపీ అభ్యర్థి అయిన సీఎం రమేష్ ను, పెందుర్తి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ను గెలిపించాలని ఏపీ ప్రజలను కోరారు చిరంజీవి. అంటే ఏపీలో ఉన్న కూటమికి చిరంజీవి సపోర్ట్ ఇచ్చినట్లే. అయితే ఏపీలో కూటమికి చిరంజీవి సపోర్ట్ ఇవ్వడం పై వైసీపీ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. Chiranjeevi

తమ్ముని కోసం అన్నయ్య వచ్చాడని ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక వైసిపి పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అటాక్ చేశారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు అడవి పందులు, గుంట నక్కలు, దుర్మార్గులు అందరూ ఏకమవుతున్నారని చిరంజీవిని ఉద్దేశించి ఇన్ డైరెక్ట్ గా సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. అయితే కూటమికి చిరంజీవి సపోర్ట్ చేస్తే… గెలిచి అవకాశాలు తక్కువే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి పై దాడులు చేస్తున్నారనే సెంటిమెంట్ ఇప్పుడు ఏపీ ప్రజల్లో రగులుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. Chiranjeevi

జగన్మోహన్ రెడ్డి ని అందరూ ఒంటరి చేసి… అధికారం కోసం దుర్మార్గాలు చేస్తున్నారని… ఏపీలోని కొంతమంది ప్రజల్లో చర్చ జరుగుతోందట. ఇప్పుడు చిరంజీవి వెళ్లిన మాత్రాన వైసీపీ పార్టీకి ఎలాంటి డోకా లేదని కూడా చెబుతున్నారు. ఏపీ ప్రజలకు సెంటిమెంట్ రాజకీయాలు బాగా అబ్బుతాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి, అలాగే కూటమి సభ్యుల దాడులు ఇలా అన్ని వైసిపి పార్టీకి అనుకూలిస్తాయని చెబుతున్నారు.Chiranjeevi

Join WhatsApp