Chiranjeevi for pawan kalyan over pithapuram janasena

Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అందరూ దృష్టి ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం పైన ఉంది. ఆ నియోజకవర్గంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తు న్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు స్థానాల్లో పోటీ చేశారు. గాజువాక మరియు భీమవరం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ బరిలో నిల్చున్నారు. కానీ రెండు చోట్ల గోరంగా ఓడిపోయారు పవన్ కళ్యాణ్. Chiranjeevi

Chiranjeevi for pawan kalyan over pitapuram janasena

సరైన ప్రచారం, ప్రణాళికలు, టిడిపి ఓట్ల చీలిక తదితర కారణాలవల్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయారు. అయితే ఇప్పుడు అలాంటి తప్పిదాలు జరగకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారు. ఈసారి పిఠాపురం నియోజకవర్గ నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్.. ప్రచారం కోసం అన్ని ఆస్త్రాలను సంధిస్తున్నారు. Chiranjeevi

ఇందులో భాగంగానే తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని కూడా ప్రచారానికి దింపేశారు పవన్ కళ్యాణ్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోను కూడా చిరంజీవి విడుదల చేశారు. తన తమ్ముడిని దయచేసి గెలిపించండి అంటూ వేడుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. తన తల్లికి చిన్న కొడుకు పవన్ కళ్యాణ్ అని… ప్రజల కోసం నిత్యం సేవ చేసేవాడని చిరంజీవి చెప్పుకొచ్చారు. Chiranjeevi’

Also Read: Cm Revanth Reddy: జూలై 14వ తేదీన జైలుకు రేవంత్ రెడ్డి ?

అలాంటి వ్యక్తిని గెలిపిస్తే పిఠాపురం నియోజకవర్గం బాగుంటుందని చిరంజీవి వెల్లడించారు. అయితే… గ్రౌండ్ స్థాయిలో పవన్ కళ్యాణ్ కు ఏ మాత్రం రిపోర్ట్స్ బాగాలేవట. వైసిపి పార్టీ తరఫున వంగ గీత బరిలో ఉండటం పవన్ కళ్యాణ్ కు పెద్ద మైనస్ అట. వంగ గీత మహిళా కావడమే కాకుండా ఆమె కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ. దీంతో పవన్ కళ్యాణ్ అలాగే వంగవీటి ఇద్దరు కూడా కాపు నేతలు అయిపోయారు. ఈ తరుణంలో కాపు ఓట్లు చీలే ప్రమాదం ఉంది. Chiranjeevi

అటు ముద్రగడ పద్మనాభం కూడా… వైసిపి పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ మేరకు పార్టీలో చేరే వైసిపి కోసం ప్రచారం కూడా చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే… చిరంజీవినీ రంగంలోకి దింపి ఎలాగైనా గెలవాలని పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తున్నారు. మరి తాజాగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్ కు ఏ మేరకు విజయం దక్కుతుంది చూడాలి. Chiranjeevi

Join WhatsApp