CM Jagan To Release MLA and MP Candidates Fifth List Soon

CM Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, వైఎస్ఆర్‌సీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ‌త కొద్ది రోజుల నుంచి ఇంఛార్జ్‌ల మార్పులు చేర్పుల ప్ర‌క్రియ‌లో బిజీ బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. రాబోయే ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా చేసుకున్న జ‌గ‌న్‌.. ఆ దిశ‌గా పావులు క‌దుపుతున్నారు. స‌ర్వేల ఆధారంగా గెలుపు గుర్రాల‌ను బ‌రిలోకి దించుతున్నారు. ఇప్ప‌టికే దశలవారీగా పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి నాలుగు జాబితాల‌ను విడుద‌ల చేశారు.

CM Jagan To Release MLA and MP Candidates Fifth List Soon

ఈ నాలుగు జాబితాల్లో మొత్తంగా 58 ఎమ్మెల్యే, 10 ఎంపీ స్థానాలకు వైసీపీ అధిష్టానం ఇన్‌ఛార్జ్‌లను మార్చింది. కొంద‌రికి స్థాన చ‌ల‌నం క‌ల్పించింది. ఈ క్ర‌మంలోనే వైసీపీ నేత‌ల్లో హై టెన్ష‌న్ నెల‌కొంది. త‌మ సీటు ఉంటుందో.. ఊడుతుందో.. అర్థంగాక బెంబేలెత్తిపోతున్నారు. ఇక‌పోతే ప్ర‌స్తుతం ఐదో లిస్ట్‌పై జ‌గ‌న్ క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టారు. దీంతో గ‌త రెండు రోజుల నుంచి పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నేత‌లు తాడేప‌ల్లికి క్యూ క‌డుతున్నారు.

నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలను పిలుపించుకొని జ‌గ‌న్‌ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. టికెట్ ఇవ్వని నేతలకు సర్దిచెబుతున్నారు. టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డానికి కార‌ణాలు ఏంటో వివ‌రిస్తున్నారు. తాజాగా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే మ‌రియు మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎంపీ మోపిదేవి వెంకటరమణ సీఎంవోకు వెళ్లారు. (CM Jagan)

Also Read: AP Voters Final List: ఏపీలో ఓటర్ల తుది జాబితా విడుదల.. మీ పేరు ఉందో లేదో ఈజీగా చెక్ చేసుకోండిలా!

రేపల్లె ఇంఛార్జిగా మోపిదేవి వెంకటరమణ తొలగించి ఈవూరు గణేష్ ను వైసీపీ అధిష్టానం ఇప్ప‌టికే నియమించింది. ఈ నేప‌థ్యంలోనే తీవ్ర అసంతృప్తితో తాడేపల్లికి చేరుకున్న మోపిదేవి వెంకటరమణ.. తనను రేపల్లె ఇంఛార్జిగా నియమించాలంటూ పట్టుబడుతున్నారు. దీంతో జ‌గ‌న్ మ‌ళ్లీ ఆలోచ‌న‌లో ప‌డిన‌ట్లు ఇన్‌సైడ్ టాక్ నడుస్తోంది. మ‌రోవైపు వైసీపీ నుంచి వ‌ల‌స‌ల ప‌ర్వం ఊపందుకుంది. సీటు ద‌క్క‌ని నాయ‌కులు పార్టీకి రాజీనామా చేసేస్తున్నారు. తాజాగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీకి రాజీనామా చేసి జ‌గ‌న్ కు షాకిచ్చారు. ఈసారి ఎన్నిక‌ల్లో నరసరావుపేట నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయాలని హై క‌మాండ్‌ సూచించింది. నరసరావుపేటలో కొత్త అభ్యర్థిని నిలబెట్టాలని భావించింది. ఈ కార‌ణంగానే లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు.

Join WhatsApp