CM Revanth Reddy Political Strategy Over Prof Kodandaram MLC Post

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణంగా ఉద్యమ నాయకులు ప్రొఫెసర్ కోదండరాంరెడ్డి బలి పశువు అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కారణంగా కోదండరాంకు అలాగే ముస్లిం సామాజిక వర్గానికి చెందిన సియాసత్ పత్రిక ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ కు ఘోర అవమానం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

CM Revanth Reddy Political Strategy Over Prof Kodandaram MLC Post

కోదండరాం మరియు సియాసత్ పత్రిక ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ ఇద్దరికీ ఎమ్మెల్సీ పదవులు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరికీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి… రాజకీయ నేపథ్యం ఉన్న నాయకులకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులు ఇవ్వకూడదని గతంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిలి సై నిర్ణయం తీసుకున్నారు.

Also Read: Prashant Kishor: మళ్లీ వచ్చేది మోడీ ప్రభుత్వమే..బీజేపీకి ఎన్ని సీట్లు అంటే ?

రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వారికి… గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవులు ఇవ్వబోమని… గతంలో దాసోజు శ్రవణ్ మరియు కుర్ర సత్యనారాయణ దరఖాస్తులను తిరస్కరించారు తెలంగాణ గవర్నర్. దీంతో అప్పట్లో ఈ అంశం తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. గవర్నర్ వర్సెస్ కేసీఆర్ గా రాజకీయాలు పులుముకున్నాయి.

కట్ చేస్తే… కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత… రాజకీయ నేపథ్యం ఉన్న జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం, గతంలో వైసిపి పార్టీలో చేరిన అమిర్ అలీ ఖాన్ కు గవర్నర్ కోటాలో పదవులు ఇచ్చేందుకు గవర్నర్ తమిళ్ సై నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపై దాసోజు శ్రవణ్ మరియు సత్యనారాయణ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

వీరిద్దరి పిటిషన్ విచారణ చేసిన తెలంగాణ హైకోర్టు కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పదవులకు బ్రేక్ వేసింది. తుది తీర్పు వచ్చేవరకు ఎమ్మెల్సీ పదవులకు ప్రమాణ స్వీకారం చేయకూడదని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దీంతో కోదండరామును కావాలనే రేవంత్ రెడ్డి బలిపశువు చేశాడని చర్చించుకుంటున్నారు. ఇలా జరుగుతుందని రేవంత్ రెడ్డికి ముందే తెలుసని సమాచారం. అయితే దీని వెనుక కుట్రలు చేసేది కేసీఆర్ అని… అందరూ చర్చించుకునేలా రేవంత్ రెడ్డి… ఈ ప్లాన్ వేశారని టిఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. మరి దీనిని టిఆర్ఎస్ ఎలా తీసుకుంటుందో చూడాలి. (Revanth Reddy)

Join WhatsApp